క్యాబ్ డ్రైవర్ నిజాయతీ
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:13 AM
మాక్సి క్యాబ్‌లో ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగ్‌ను అప్పగించి డ్రైవర్ నిజాయితీని నిరూపించుకున్న ఘటన శుక్రవారం సంభవించింది.
పోగొట్టుకున్న బ్యాగ్‌ను అప్పగించిన వైనం
మూడు తులాల బంగారం, మూడు వేల నగదు అందజేత
శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మాక్సి క్యాబ్‌లో ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగ్‌ను అప్పగించి డ్రైవర్ నిజాయితీని నిరూపించుకున్న ఘటన శుక్రవారం సంభవించింది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నందిగాం మండలం ఆనందపురానికి చెందిన రాము తన బంధువులతో కలిసి గురువారం భిలాయ్ వెళ్లేందుకు నందిగాం హైవేపై మాక్స్ క్యాబ్‌ను ఎక్కాడు. పెద్దపాడు వద్ద దిగి బస్సులో విజయనగరంలో రైలు ఎక్కేం దుకు వెళ్లాడు. విజయనగరంలో దిగినప్పుడు చూసుకుని తన బ్యాగ్ లేకపోవడంతో కంగారు పడ్డాడు. అయితే ప్రయాణికులను పెద్దపాడులో దింపి శ్రీకాకుళం చేరుకున్న డ్రైవర్ రవికుమార్ తన క్యాబ్‌లో బ్యాగ్‌ను చూసి శ్రీకాకు ళం టూటౌన్ పోలీసులకు అప్పగించాడు. బ్యాగ్ మరిచిన ప్రయాణికుడు రాము ముందు పెద్దపాడు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించిన అనంతరం టూటౌన్ పోలీసులకు ఆశ్రయించాడు. అప్పటికే డ్రైవర్ రవికుమార్ బ్యాగ్ పోలీసలకు ఇవ్వడంతో ప్రయాణికుడి వివరాలు సేకరించి బ్యాగ్‌ను, అందులో ఉన్న మూడు తులాల బంగారం, మూడు వేల నగదు, నాలుగు కేజీల జీడిపప్పు, దుస్తులను పోలీసులు ప్రయాణికుడికి అప్పగించారు. తన బ్యాగును అప్పగించినందుకు రాముకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.