Share News

సందడిగా నూతన సంవత్సర వేడుకలు

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:39 PM

ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు గురు వారం ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. ప్రజా ప్రతి నిధులు, నేతలు, అధికారులను వివిధ పార్టీల నేతలు, కార్యక ర్తలు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

 సందడిగా నూతన సంవత్సర వేడుకలు
రణస్థలం: ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావుకు శుభాకాంక్షలు తెలుపుతున్న కూటమి నాయకులు

న్యాయాధికారులు, నేతలు, అధికారులకు శుభాకాంక్షల వెల్లువ

అరసవల్లి/ శ్రీకాకుళం లీగల్‌/ స్పోర్ట్స్‌/ ఎచ్చెర్ల, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు గురు వారం ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. ప్రజా ప్రతి నిధులు, నేతలు, అధికారులను వివిధ పార్టీల నేతలు, కార్యక ర్తలు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రణస్థలంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, అరసవల్లిలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఎస్‌ఎంపురంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మిలను కూటమి నేతలు, కార్యకర్తలు, వివిధ శాఖల సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డా.బీఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ లో వీసీ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజనిని అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో జిల్లా కీర్తి ఇనుమడింపజేసిన వెటరన్‌ క్రీడా కారులను బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సత్క రించారు.

జిల్లా కోర్టులోనూ..

జిల్లా కోర్టులో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా కేక్‌ కట్‌ చేసి కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో అద నపు జిల్లా న్యాయాధికారులు పి.భాస్కరరావు, సీహెచ్‌ వివే కానంద శ్రీనివాస్‌, ఎస్‌ఎం ఫణి కుమార్‌, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారులు ఎం.శ్రీధర్‌, ఆర్‌.శాంతిశ్రీ, డీఎల్‌ఎస్‌ఏ కార్య దర్శి కె.హరిబాబు, జుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయాధికారి కేజేఎం బేగం, బార్‌ అసోసియేషన్‌ ఉఫాధ్య క్షుడు ఇప్పిలి సీతరాజు, కార్యదర్శులు మోటూరి భవానీ ప్రసాద్‌, కొమ్ము రమణమూర్తి, త్రిపురాన వరప్రసాద్‌, గురు గుబిల్లి వనజాక్షి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2026 | 11:40 PM