శ్రీముఖలింగంలో కామదహనం
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:03 AM
శ్రీముఖలింగేశ్వరాలయ క్షేత్రంలో మంగళవారం రాత్రి కామదహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
జలుమూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగేశ్వరాలయ క్షేత్రంలో మంగళవారం రాత్రి కామదహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చంద్రగ్రహణం అనంతరం ఆలయాన్ని శుద్ధిచేసి సంప్రోక్షణం చేసి అర్చకులు కామదహనం కార్యక్రమం సంప్రదాయబద్ధంగా చేశారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాత్రి తొమ్మిది గంటలు సమయంలో పార్వతీపరమేశ్వరుల ఉత్సవమూర్తులను బయటకు తీసుకొచ్చి అలంకరించిన అనంతరం పల్లకిలో ఆశీనులు చేశారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నుడుమ గ్రామోత్సవం నిర్వహించి ఉన్నతపాఠశాల వరకు తీసుకెళ్లి కామదహనం చేశారు. ఏటా శ్రీకూర్మంలో జరిగే కామదహనం రోజున శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రంలో కామదహనం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఏడుకొండలు, అర్చకులు నారాయణమూర్తి, సింహాచలం, ఎస్‌వీ చలం, శ్రీకృష్ణ, శివ, అచ్యుత పాల్గొన్నారు.