నిర్మించారు.. వదిలేశారు
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:05 AM
మందసలో మోడల్ పోలీస్‌స్టేషన్ భవనంపనులు పూర్తయినా మూడే ళ్లుగా ప్రారంభానికి నోచుకోవడంలేదు.
హరిపురం, మార్చి 3(ఆంధ్రజ్యోతి): మందసలో మోడల్ పోలీస్‌స్టేషన్ భవనంపనులు పూర్తయినా మూడే ళ్లుగా ప్రారంభానికి నోచుకోవడంలేదు. దీంతో పిచ్చిమొక్క లు, ముళ్లపొదలతో నిండి విషసర్పాలకు నిలయాలుగా మారుతోంది. తొలుత మోడల్ పోలీస్‌స్టేషన్‌ను జిల్లాలో మందసను ఎంపికచేశారు. దీంతో మందస గాయత్రీ నగర్ సమీపంలో పాత పోలీస్ క్వార్టర్స్ స్థలంలో 1.2 ఎకరాల్లో మూడేళ్లు కిందట రూ.2.15 కోట్లతో పోలీస్ స్టేష న్ భవనం, నీటి ట్యాంకు నిర్మించారు. పనులు పూర్తయినా వైసీపీ ప్రభుత్వం ప్రారంభించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రారంభానికి సం బంధిత అఽధికారులు చొరవచూపడంలేదు. అయితే తొలు త స్థలం ఎంపికలో వివాదం చోటుచేసుకున్నా చివరకు పోలీస్‌శాఖకు చెందిన స్థలంలో అత్యాధునిక సదుపాయా లు, అన్నిహంగులు, టెక్నాలజీ ఉపయోగించి సర్వాంగసుం దరంగా నిర్మాణాలు పూర్తిచేశారు. కాగా నిర్మాణం పూర్తయినా ప్రజాప్రతినిధుల స్పందన లేకపోవడంతో ప్రారంభానికి నోచుకోవడంలేదు. అఽధికారులు ప్రజా ప్రతి నిధులు స్పందించి భవనం ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.