Share News

నిర్మించారు.. వదిలేశారు

ABN , Publish Date - Mar 01 , 2026 | 11:46 PM

: టెక్కలి మండలం ల చ్చన్నపేట సమీపంలో, సోంపేట మం డలం పాలవలస వద్ద నిర్మించిన ఎంఎల్‌ఎస్‌ స్టాక్‌ పాయింట్‌ గోదాముల నిర్మాణం పూర్తయినా నేటికీ వినియోగంలోకి రాలేదు.

నిర్మించారు.. వదిలేశారు
లచ్చన్నపేట వద్ద నిర్మించిన గోదాము:

టెక్కలి రూరల్‌, మార్చి 1(ఆంధ్రజ్యోతి): టెక్కలి మండలం ల చ్చన్నపేట సమీపంలో, సోంపేట మం డలం పాలవలస వద్ద నిర్మించిన ఎంఎల్‌ఎస్‌ స్టాక్‌ పాయింట్‌ గోదాముల నిర్మాణం పూర్తయినా నేటికీ వినియోగంలోకి రాలేదు. దీంతో నిరుపయోగంగా ఉండడం వల్ల పరిసరాల్లో పిచ్చిమొక్కలు పెరగడం తో విషసర్పాలకు నిలయంగా మారాయి. లచ్చన్న పేట సమీపంలో జాతీయరహదారి పక్కాన టెక్కలి, నందిగాం మండలానికి సంబంధించి రేషన్‌ సరఫరా కు ఏడేళ్ల కిందట 1000 టన్నుల బియ్యం నిల్వ చేసు కునేలా గోదాము నిర్మించారు. సోంపేట మండలం పాలవలస వద్ద ఐదేళ్లు కిందట అన్ని సౌకర్యాలతో సోంపేట, కంచిలి మండలాలకు ఇక్కడ రేషన్‌ సరు కులు నిల్వచేయడానికి అన్ని సౌకర్యాలతో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నిర్మించారు. ఈ నేపథ్యంలో టెక్కలి జూని యర్‌ కళాళాల మైదానంలో గల డీసీఎంఎస్‌ అద్దె భవనం నుంచి 30 ఏళ్లగా రేషన్‌ సరుకులు సరఫరా చేస్తున్నారు. పాత భవనంపై గల సిమెంట్‌ రేకులు బీటలు కావడంతో వర్షాలు కురుస్తున్న సమయం లో కారు తుండడంతో ఇబ్బందిపడుతున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో ప్రస్తుతం ప్రతి నెలా 9,665.987 మెట్రిక్‌ టన్నులు బియ్యం మండల స్టాక్‌పాయింట్ల(ఎంఎల్‌ఎస్‌) ద్వారా డిపో లకు సరఫరా చేస్తున్నారు. ఆమదాలవలస, తామరా పల్లిలో ఉన్న పౌరసరఫరాలు గోదాముల్లో నిల్వచేసిన సరుకులను మండలాలకు సంబంధించిన స్టాక్‌పా యింట్లకు తరలించి అక్కడి నుంచి రేషన్‌ డిపోలకు సరఫరా చేస్తున్నారు. అయితే బియ్యం గోదాముల తోపాటు ఎంఎల్‌ఎస్‌ స్టాక్‌పాయింట్ల వద్ద అక్రమా లకు పాల్పడుతున్నట్లు విమర్శలు రావడంతో అడ్డు కట్టు వేయడానికి ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద వే బ్రిడ్జి ఏర్పాటుచేసి అక్కడే తూకం వేసి డీలర్లకు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. దీంతోపాటు ఎఫ్‌సీ గోదాముల నుంచి లారీల ద్వారా వస్తున్న బియ్యం కూడా తూకం వేసి దించాలని స్పష్టంచేశా రు. అయితే ఎక్కడా తూకం వేసి ఇచ్చిన పరిస్థి తులు కనిపించ డం లేదు. దీంతో రే షన్‌ అక్రమాలు కట్టడిచేయలేని పరిస్థితి కనిపిస్తోంది.

అద్దెభారం మోయలేక

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు వద్ద గోదాములకు ఎక్కు వ మొత్తంలో అద్దె చెలించాల్సివస్తోంది. అద్దెభారం మోయలేని పరిస్థితి నెలకొంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిధిలో కంచిలి, స రుబుజ్జలి రెండు భవనాలకు ఏడాదికి రూ.4.27 లక్షలు అద్దె చెల్లిస్తున్నట్టు అధికారులు చెబు తున్నారు. డీసీఎంఎస్‌ ద్వారా శ్రీకా కుళం, టెక్కలి భవనాలకు రూ.2.01 లక్ష లు, పలాసలో రూ.1.01 లక్షలు చెల్లించాల్సివ స్తోందని పేర్కొంటున్నారు. గతంలో నిర్మించిన భవనాలకు తాగునీరు, విద్యుత్‌ సౌకర్యంతోపాటు చిన్నచిన్న మరమ్మతులకు సుమారు రూ.10.50 లక్షలు అవసరమని అధికారులు అంచనాలు వేశారు. టెక్కలి, సోంపేట, గార, వజ్రపుకొత్తూరు మండలాల్లో నిర్మించిన భవనాలకు రోడ్లు, విద్యుత్‌, తాగునీరు కల్పించాల్సి ఉంది.

Updated Date - Mar 01 , 2026 | 11:47 PM