Share News

మౌలిక వసతులకు బడ్జెట్‌ దోహదం

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:01 AM

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్రాభివృద్ధికి వెన్నుదన్నుగా ఉం టుందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకురిటి ఈశ్వరరావు పేర్కొన్నారు.

మౌలిక వసతులకు బడ్జెట్‌ దోహదం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే నడుకురిటి ఈశ్వరరావు:

అరసవల్లి/గుజరాతీపేట, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్రాభివృద్ధికి వెన్నుదన్నుగా ఉం టుందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకురిటి ఈశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల పెంపుదలకు బడ్జెట్‌ ఎంతోగానో దోహదపడుతుందని తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ 2047వరకు డేటా సెంటర్లకు టాక్స్‌ హాలిడే ఇవ్వడం రాష్ట్రం డేటా సెంటర్‌ హబ్‌గా మారడం తథ్యమన్నారు. విశాఖపట్నం గ్లోబల్‌ ఏఐ హబ్‌గా మారుతుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ఈ బడ్జెట్‌ అన్ని విధాలా ఎంతో ఉపయోగకరమని తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురపు తేజేశ్వరరావు, పైడి వేణుగోపాలం, శవ్వాన ఉమా మహేశ్వరి, అట్టాడ రవిబాబ్జీ, సూరపునాయుడు, సింతు పాపారావు, మదన్‌, పోకతోట సింహాచలం పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 12:01 AM