Share News

లింకు తెగిన గూడ్స్‌

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:11 AM

Train stopped in the middle of LC gate పలాస రైల్వేస్టేషన్‌లో ఎల్‌సీ గేటుకు వద్ద గూడ్స్‌ రైలు లింకు తెగిపోయింది. దీంతో గంటపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయి.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

లింకు తెగిన గూడ్స్‌
ఎల్‌సీ గేటు వద్ద నిలిచిపోయిన గూడ్స్‌రైలు..

ఎల్‌సీ గేటు మధ్యలో ఆగిపోయిన రైలు

గంటపాటు నిలిచిపోయిన ట్రాఫిక్‌

పలాస, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): పలాస రైల్వేస్టేషన్‌లో ఎల్‌సీ గేటుకు వద్ద గూడ్స్‌ రైలు లింకు తెగిపోయింది. దీంతో గంటపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయి.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకి వెళిలే.. సోమవారం సాయంత్రం పలాస రైల్వేస్టేషన్‌ నుంచి విశాఖపట్నం ఎన్టీపీసీకి బొగ్గు రవాణా చేస్తున్న రైలు భోగీలకు ఉన్న లింకు తప్పిపోయింది. దీనికి ఉన్న వ్యాక్యూమ్‌ వీడిపోవడంతో రైలు ముందుకువెళ్లడానికి మొరాయించింది. దీన్ని గుర్తించిన రైలుడ్రైవరు గూడ్స్‌ను వెంటనే నిలిపేయడంతో ప్రమాదం తప్పింది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని విడిపోయిన లింకును కలిపి యథాతఽథంగా రైలును ముందుకు సాగనంపారు. గేటుకు సమీపంలో రైలు నిలిచిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా గంటపాటు ట్రాఫిక్‌ స్తంభించింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొంతమంది ప్రయాణికులు బస్సులు దిగి రైల్వేట్రాక్‌ మీదుగా నడుచుకుంటూ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. కిలోమీటరు పొడవునా ట్రాఫిక్‌ స్తంభించడంతో రైల్వే అధికారులు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించారు.

Updated Date - Feb 24 , 2026 | 12:11 AM