Share News

ప్రజల ముంగిటకే ప్రభుత్వ పాలన

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:51 PM

ప్రజల ముంగిటకే పాలన అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

ప్రజల ముంగిటకే ప్రభుత్వ పాలన
కరపత్రం ఇచ్చి వివరిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌

ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం అర్బన్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ప్రజల ముంగిటకే పాలన అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. కూటమి ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం నగరంలోని 28వ డివిజన్‌ పరిధిలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. మావూరివీధి, ఎస్సీ వీధి, కలెక్టర్‌ బంగ్లా తదితర ప్రాంతాల్లో పర్యటించి సంక్షేమ, అభివృద్ధి కార్య క్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే సంబం ధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్క రించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 11:51 PM