Share News

అండర్‌-17 జాతీయ క్రికెట్‌ పోటీలకు గొల్లమాకన్నపల్లి బాలుడు ఎంపిక

ABN , Publish Date - Nov 30 , 2026 | 12:10 AM

పలాస మండలంలోని గొల్లమాకన్న పల్లికి చెందిన రాపాకసాహిల్‌ డిసెంబరు పదో తేదీ నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరగనున్న అండర్‌-17 జాతీయక్రికెట్‌ పోటీలకు ఎంపికయ్యాడు.

 అండర్‌-17 జాతీయ క్రికెట్‌ పోటీలకు  గొల్లమాకన్నపల్లి బాలుడు ఎంపిక
సాహిల్‌కు అభినందిస్తున్న క్రీడాకారులు

పలాస, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): పలాస మండలంలోని గొల్లమాకన్న పల్లికి చెందిన రాపాకసాహిల్‌ డిసెంబరు పదో తేదీ నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరగనున్న అండర్‌-17 జాతీయక్రికెట్‌ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆయనకు ఆదివారం రైల్వేక్రీడా మైదానంలో ఏపీ ఎన్జీవో పలాస శాఖ అధ్యక్షుడు బోనెల గోపాల్‌, జిల్లా షటిల్‌ బాడ్మింటన్‌ అసోసియేషన్‌ జన రల్‌ సెక్రటరీ ఎం.మల్లిఖార్జునరావు అభినందించారు. కార్యక్రమంలో వై.రవి, డి.గౌతమ్‌చక్రవర్తి, పి.ఆనందరావు, బి.రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2026 | 12:10 AM