గదుల్లో పుస్తకాలు.. నేలపై చదువులు
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:04 AM
టెక్కలి జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా విద్యార్థులు నేలపైనే చదవా ల్సివస్తోంది. ఇక్కడ ఆరు నుంచి పదో తరగతి వరకు 656 మందిపైగా విద్యార్థినులు అభ్యసిస్తున్నారు.
టెక్కలి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): టెక్కలి జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా విద్యార్థులు నేలపైనే చదవా ల్సివస్తోంది. ఇక్కడ ఆరు నుంచి పదో తరగతి వరకు 656 మందిపైగా విద్యార్థినులు అభ్యసిస్తున్నారు. అన్ని తరగతులకు సంబంధించి తరగతి గదుల్లో బెంచీలు ఏర్పాటుచేశారు. అయితే మండల విద్యాశాఖ యం త్రాంగం పది తరగతి గదులను వారి ఆధీనంలోకి తీసుకొంది. మండలం లోని విద్యార్థులకు సంబంధించిన పాఠ్య, నోటు పుస్తకాలు ఇక్కడే ఉంచా రు. పాఠశాలలు తెరిచి వారంరోజులు గడిచినా ఈ నోటు, పాఠ్యపుస్తకాలు మరో రెండు గదుల నుంచి తరలించకపోవడంతో విద్యార్థినులు నేల చదు వులపై ఆధారపడాల్సి వచ్చింది. ఇంకా పలుతరగతి గదుల్లో బెంచీలు సైతం వరండాల్లోనే దర్శనమిస్తుండడంతో ఆయా తరగతుల్లో కూడా కొం దరు విద్యార్థినులు నేలపైనే కూర్చొని చదువుతున్నారు. కాగా తరగతి గదు ల్లో మండల విద్యాశాఖకు సంబంధించిన పుస్తకాలు ఉండడంతో ఖాళీలేక విద్యార్థినులు నేలపై కూర్చొని చదువుతున్నారని ఇన్‌చార్జి హెచ్‌ఎం ఈశ్వర మ్మ తెలిపారు. అలాగే శనివారానికి పుస్తకాలు ఉన్న తరగతిగదులు ఖాళీ చేయించి విద్యార్థులకు అందజేస్తామని ఎంఈవో చిన్నారావు తెలిపారు.