అనుమానంతోనే బాంబు దాడులు
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:54 AM
ట్రంప్ నుంచి మైక్రోసాఫ్ట్ అధినేత వరకు సెక్స్ రాకెట్‌లో కూరుకుపోయారని, టె హ్రాన్‌లో వీరి వీడి యోలు, ఫొటోలు ఉన్నా యనే అనుమానంతోనే ఇరాన్‌పై బాంబు దాడులు ప్రారంభించారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు.
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
శ్రీకాకుళం అర్బన్, మార్చి 13 (ఆంధ్ర జ్యోతి): ట్రంప్ నుంచి మైక్రోసాఫ్ట్ అధినేత వరకు సెక్స్ రాకెట్‌లో కూరుకుపోయారని, టె హ్రాన్‌లో వీరి వీడి యోలు, ఫొటోలు ఉన్నా యనే అనుమానంతోనే ఇరాన్‌పై బాంబు దాడులు ప్రారంభించారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. త్వరలో మన దేశానికి చెందిన కొంతమంది పెద్దల పేర్లు బయటకు రాబోతున్నాయని తెలిపారు. శుక్రవారం ఆయన నగరంలోని ఓ హోటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు జగన్ రాష్ట్రాన్ని 11 ఏళ్లు పరిపాలించారు. కనీసం కడప జిల్లాను కూడా అభివృద్ధి చేయలేదు. రాష్ట్ర అప్పుల గురించి జగన్ మాట్లాడుతున్నారు. లిక్కర్ స్కామ్‌లో డబ్బు దోచుకోలేదని జగన్ చెప్పగలడా...?’ అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.