Share News

రూ.32.5 లక్షలతో ‘బోదుబట్టి’ పనులు

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:04 AM

శ్రీకాకుళం రూరల్‌ మండ లంలోని అంపోలు న్యాయపతి ట్యాంక్‌ నుంచి సముద్రం వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర ఉన్న ‘బోదు బట్టి’ కాలువ ప్రక్షాళన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పనులను ఆదివారం ఎమ్మెల్యే గొం డు శంకర్‌ పరిశీలించారు.

రూ.32.5 లక్షలతో ‘బోదుబట్టి’ పనులు
బోదుబట్టిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్‌

అరసవల్లి, జూలై 19(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రూరల్‌ మండ లంలోని అంపోలు న్యాయపతి ట్యాంక్‌ నుంచి సముద్రం వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర ఉన్న ‘బోదు బట్టి’ కాలువ ప్రక్షాళన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పనులను ఆదివారం ఎమ్మెల్యే గొం డు శంకర్‌ పరిశీలించారు. 1898లో బ్రిటీష్‌ కాలంలో తవ్విన ఈ కాలువ ఎన్నో ఏళ్లుగా నిరాదరణకు గురైంది. కాలువ ఆక్రమణ లకు గురికావడం, పొదలు, పిచ్చి మొక్కలు పెరి గిపోయి వర్షాకాలంలో కూడా నీరు సాఫీగా వెళ్లలేని పరిస్థితి నెల కొంది. కాలువ పూడికతో ఎస్‌ఎస్‌ వలస, తండ్యాం వలస, సింగుపురం తదితర గ్రామాల్లోని సుమారు 3వేల ఎకరాల భూములు ముంపు నకు గురవుతున్నాయి. వరద లు లేని సమయంలో కాలు వలో నీరు ప్రవహించకపోవ డంతో సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. ఈ నేప థ్యంలో ఎమ్మెల్యే చొరవ తీసు కుని కలెక్టర్‌ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో రూ.32.5 లక్షల నిధులు మం జూరు కాగా స్థానిక నీటి సం ఘాల ఆధ్వర్యంలో పనులు చేపడుతు న్నారు. ఈ మేరకు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఈ పనులు పది రోజుల్లో పూర్తవు తాయని, సము ద్రం వరకు కాలువను శుభ్రం చేసేందుకు అవసరమైతే మరో రూ.10 లక్షల నిధులను సమకూరుస్తామ న్నారు. కాలువ శాశ్వత ఆధునికీకరణకు రూ.13 కోట్లతో ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లామ న్నారు.

Updated Date - Jul 20 , 2026 | 12:04 AM