Share News

ఒడ్డుకు చేరిన బోట్లు

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:25 AM

Hunting ban on sandram for two months సముద్రంపై రెండు నెలల పాటు మోటారు, మరబోట్లతో చేపల వేట నిషేధం నేపథ్యంలో మత్స్యకారుల కదలికలను గురువారం గమనించగా సంద్రం సందడి లేకుండా కనిపించింది.

ఒడ్డుకు చేరిన బోట్లు

  • రెండు నెలల పాటు సంద్రంపై వేట నిషేధం

  • వలలు సరిచేసుకోవడంలో మత్స్యకారులు బిజీ

  • మత్స్యకారుల చేపలవేట తాత్కాలికంగా ఆగిపోయింది. అలలతో పోటీపడే బోట్లు ఇప్పుడు ఒడ్డున నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. ఉదయం వేళల్లో చేపల వేటకు మత్స్యకారులు సందడి కన్పించాల్సిన తీరం ఇప్పుడు వలలు సరిచేసుకుంటున్న చేతులతో, బోట్లను భద్రపరుచుకుంటున్న అడుగులతో బిజీగా మారింది.

  • ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): సముద్రంపై రెండు నెలల పాటు మోటారు, మరబోట్లతో చేపల వేట నిషేధం నేపథ్యంలో మత్స్యకారుల కదలికలను గురువారం గమనించగా సంద్రం సందడి లేకుండా కనిపించింది. ఎచ్చెర్ల మండలంలో డి.మత్స్యలేశం సముద్ర తీరాన్ని పరిశీలించగా మత్స్యకారులంతా బోట్లను, వలలను, ఇతర సామగ్రి సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుస్తూ కన్పించారు. వలలు సరిచేసుకోవడంలో, బోట్లను ఒడ్డుకు చేర్చడంలో, వలలను ఒక దగ్గర ఉంచడంలో తీరికలేకుండా గడిపారు. దేశం మొత్తమ్మీద ప్రతిఏటా చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. చేపల గుడ్లు పెట్టే దశలో రెండు నెలల పాటు చేపల వేట నిషేధాన్ని కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు.

  • వలలు సరిచేయడంలో..

  • ఈ నెల 14వ తేదీ ఆర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. గతంలో కంటే ప్రస్తుతం మోటారు బోట్లతో చేపలు వేటాడేవారి సంఖ్య ఎక్కువైంది. సుమారు రూ. 3 లక్షలు విలువ చేసే పైబర్‌ బోటును ఇద్దరు, ముగ్గురు మత్స్యకారులు కలిసి కొనుగోలు చేసి చేపలు వేటాడుతున్నారు. ప్రభుత్వం కూడా సబ్సిడీపై బోట్లను అందజేస్తుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు సముద్రంపైకి వెళితే మఽధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒడ్డుకు చేరరు. మోటారు బోటు కోసం గంటకు 2 లీటర్ల వంతున రోజుకు 12 లీటర్ల వరకు డీజిల్‌ ఖర్చు చేయాల్సివ స్తోం ది. రోజంతా కష్టపడితే శ్రమే తప్పితే ఫలితం ఉండదని మత్స్యకారులు ఆవే దన వ్యక్తంచేస్తున్నారు.

  • వేటాడే వారందరికీ భరోసా

  • వాస్తవానికి ఒక్క బోటుపై 8మందికి తక్కువ లేకుండా మత్స్య కారులు చేపల వేటకు వెళ్తుంటారు. వేట నిషేధం కావడంతో దాదాపుగా అందరికీ పనిలేకుండా పోయింది. ఈ పరిస్దితుల్లో చేపలు వేటపైనే జీవనం సాగిస్తున్న వారంద రికీ భరోసా అందజేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. అన్‌ సీజన్‌ కావడంతో సంప్రదాయ తెప్పలతో వేటాడినా ఇబ్బందులనే ఎదుర్కొంటున్నామని మత్స్యకారులు చెబుతున్నారు.

  • పూర్తిస్థాయిలో లేని ఉపాధి పనులు

  • తీర గ్రామాల్లో ఉపాధి పనులు అంతంతమాత్రంగానే ఉంటాయి. తీర ప్రాంతాల్లో చెరువులు, కాలువలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఉపాధిహామీ పనులకు పెద్దగా అవకాశం ఉండదు. జాబ్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయిలో పని కల్పించలేకపోతున్నారు. సమీప గ్రామాల్లో జరిగే ఉపాధి పనులు చేద్దామనుకున్నా వెళ్లి రా వడం కష్టమని మత్స్యకారులు చెబుతున్నారు. వేట నిషేధం అమ ల్లో ఉన్న సమయంలో మత్స్యకార మహిళలు సమీప గ్రామాలకు వెళ్లి చెరువు చేపలను కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు.

  • స్వగ్రామాలకు వలస మత్స్యకారులు

  • గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో గుజరాత్‌, కర్ణాటక తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన ఈ ప్రాంత మత్స్యకారులు చేపల వేట నిషేధంతో స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. 61 రోజుల పాటు చేపల వేట నిషేధం కారణంగా వీరంతా స్వగ్రామాలకు వచ్చేస్తున్నారు. తిరిగి వీరంతా ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో వలసవెళ్లే అవకాశం ఉంది.

  • అందరికీ భరోసా ఇవ్వాలి

  • చేపలు వేటాడే మత్స్యకారులందరికీ భరోసా అందజేయాలి. మర, మోటారు బోట్లలో చేపల వేట నిషేధంతో సంప్రదాయ తెప్పలపై వేటాడినా కష్టమే తప్ప ఫలితం ఉండదు. ప్రస్తుతం అన్‌ సీజన్‌ కావడంతో సంప్రదాయ తెప్పలతో కొద్ది మొత్తంలోనే చేపల వేట జరుగుతుంది.

    - మైలపల్లి రాముడు, కొత్త మత్స్యలేశం

  • రెండు నెలల పాటు ఇబ్బందే

  • ప్రతీ ఏటా 2 నెలల పాటు సముద్రంలో చేపల వేట నిషేఽధంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మరో ప్రత్యామ్నాయ వృత్తి తెలియకపోవడంతో ప్రభుత్వం అందజేసే భరోసాపైనే ఆధారపడుతున్నాం. గతంలో మాదిరే నిషేధం సమయంలో అదనంగా ఇచ్చే బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలి.

    - సూరాడ అప్పలరాముడు, కొత్త మత్స్యలేశం

Updated Date - Apr 17 , 2026 | 12:25 AM