Share News

రక్తదాతలు అభినందనీయులు

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:19 AM

తమ రక్తాన్ని దానం చేసి ఇంకొకరి ప్రాణాలను కాపాడే రక్తదాతలు అభినందనీయులని జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహమ్మద్‌ మౌలానా అన్నారు.

రక్తదాతలు అభినందనీయులు

శ్రీకాకుళం లీగల్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): తమ రక్తాన్ని దానం చేసి ఇంకొకరి ప్రాణాలను కాపాడే రక్తదాతలు అభినందనీయులని జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహమ్మద్‌ మౌలానా అన్నారు. తలసేమియా బాధితుల కోసం శ్రీకాకుళం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా న్యాయాధికారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వా రా ఇతరులకు స్ఫూర్తికలిగించారన్నారు. రక్తదాతలకు రోటరీ క్లబ్‌ సౌజన్యంతో ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. అలాగే న్యాయ వాదులు, ప్లీడర్‌ గుమస్తాలు, కోర్టు సిబ్బందికి ఉచిత దంత పరీక్షలు నిర్వహించారు. డా.తంగి సౌజన్య దంతపరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయాధి కారులు పి.భాస్కరరావు, సీహెచ్‌ వివేకానంద శ్రీనివాస్‌, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారులు ఎం.శ్రీధర్‌, కె.హరిబాబు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు తంగి శివప్రసాద్‌, పిట్టా దామోదర్‌, ప్రతినిధులు ఇప్పిలి సీతరాజు, మోటూరి భవానీ ప్రసాద్‌, సీనియర్‌ న్యాయవాదులు తర్లాడ రాధాకృష్ణ, జల్లు తిరుపతిరావు, తంగి చంద్రశేఖర్‌, ఎన్ని సూర్యారావు, వాన కృష్ణచంద్‌ తదితరులు పాల్గోన్నారు.

స్ఫూర్తిదాతలుగా నిలవండి: డీఎస్పీ

శ్రీకాకుళం క్రైం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రక్తదానం చేసి స్ఫూర్తి దాతలుగా నిలివాలని డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద అన్నారు. అంతర్జాతీ య మహిళా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో ఒక యూనిట్‌ రక్తం మరొకరి ప్రాణాలు కాపాడుతుందన్నారు. మహిళా వారోత్సవాల సంద ర్భంగా మహిళా భద్రత, సాధికారితపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మహిళా సీఐ నారీమణి, ఎస్‌ఐలు లావణ్య, చంద్రకళ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 12:19 AM