Share News

కిష్టుపురంలో రక్తపింజరుల సయ్యాట

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:05 AM

సాధారణంగా నాగుపాము, జెర్రిపోతు రకానికి చెందిన పాములు సయ్యాటలాడడం మనం ఎక్కడో ఓచోట చూస్తూనే ఉంటాం. కానీ పలాస మండలం జయకృష్ణాపురం (కిష్టుపురం) గ్రామంలో అరుదైన రక్తపింజరి జాతికి చెందిన పాములు సయ్యాట లాడుతూ సోమవారం కనిపిం చాయి.

కిష్టుపురంలో రక్తపింజరుల సయ్యాట
కిష్టుపురంలో కనిపించిన రక్తపింజరి పాములు

పలాస, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా నాగుపాము, జెర్రిపోతు రకానికి చెందిన పాములు సయ్యాటలాడడం మనం ఎక్కడో ఓచోట చూస్తూనే ఉంటాం. కానీ పలాస మండలం జయకృష్ణాపురం (కిష్టుపురం) గ్రామంలో అరుదైన రక్తపింజరి జాతికి చెందిన పాములు సయ్యాట లాడుతూ సోమవారం కనిపిం చాయి. అత్యంత విషపూరిత మైనవిగా చెప్పుకునే ఈ పాములు శబ్దాలు చేస్తూ కనిపించడంతో స్థానికులు హడలిపోయారు. రక్తపింజరి అంటేనే స్నేక్‌క్యాచర్లు కూడా హడలిపోతుంటారు. అత్యంత అరుదైన ఈ దృశ్యాలను స్థానికులు వీడియోలు చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. కార్తీక సోమవారం కావడంతో వాటికి హాని తలపెట్టకుండా విడిచి పెట్టినట్టు స్థానికులు తెలిపారు.

Updated Date - Nov 17 , 2026 | 12:05 AM