Share News

వంశధార-బాహుదా పనుల్లో బిల్లుల బాగోతం

ABN , Publish Date - Jul 09 , 2026 | 11:22 PM

వంశధార-బాహుదా నదుల అనుసంధానం ప్రాజెక్టు పనుల్లో జరి గిన అవక తవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది. కాంట్రా క్టర్‌కు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి చేకూర్చారనే ఆరో పణలపై శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు రిటైర్డ్‌ పే అండ్‌ అకౌంట్స్‌ అధికారులు (పీఏవోలు) డి.శ్రీనివాస రెడ్డి, పి.నాగేశ్వరరావులపై కఠిన చర్యలకు ఉపక్రమిం చింది.

 వంశధార-బాహుదా పనుల్లో బిల్లుల బాగోతం

ఇద్దరు రిటైర్డ్‌ పీఏవోలపై చార్జిషీట్లు

పది రోజుల్లో వివరణ ఇవ్వాలని రిటైర్డ్‌ అధికారులకు ఆదేశం

శ్రీకాకుళం, జూలై 9(ఆంధ్రజ్యోతి): వంశధార-బాహుదా నదుల అనుసంధానం ప్రాజెక్టు పనుల్లో జరి గిన అవక తవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది. కాంట్రా క్టర్‌కు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి చేకూర్చారనే ఆరో పణలపై శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు రిటైర్డ్‌ పే అండ్‌ అకౌంట్స్‌ అధికారులు (పీఏవోలు) డి.శ్రీనివాస రెడ్డి, పి.నాగేశ్వరరావులపై కఠిన చర్యలకు ఉపక్రమిం చింది. వీరిద్దరిపై అభియోగ పత్రాలను నమోదు చేసి విచారణకు ఆదేశిస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ గురువారం ఒకేరోజు ఏకంగా ఆరు జీవోలను జారీ చేశారు.

అసలేం జరిగిందంటే..

బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్టు అప్పటి ఎస్‌ఈ ఎం. సురేందర్‌ రెడ్డిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విజి లెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విచారణ చేపట్టగా ఈ అక్రమాలు వెలుగుచూశాయి. వంశధార- బాహుదా నదుల అనుసంధానానికి సంబంధించి రూ.1,040 కోట్ల అంచనాతో తొలుత ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా హిరమండలం రిజర్వాయర్‌ నుంచి కవిటి, కంచిలి, సోంపేట, మందస, ఇచ్ఛాపురం మండ లాలకు సాగు నీరందించేందుకు హైలెవల్‌ కెనాల్‌ డీపీ ఆర్‌ తయారీ పనులకు ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపింది. ఇందుకోసం ముందుగా రూ.2.80 కోట్లు మంజూరు చేయగా, తర్వాత దానిని రూ.4.99 కోట్లకు సవరించారు. ఈ పనులను ‘మెసర్స్‌ కాంటెక్‌ డిజైన్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అప్పగించారు.

నిబంధనలకు వ్యతిరేకంగా నిధుల విడుదల

అగ్రిమెంట్‌లోని క్లాజ్‌ 4.1 ప్రకారం, పనులు పూర్త యిన తర్వాత కాంట్రాక్టర్‌కు ముందుగా 75 శాతం నిధు లను మాత్రమే విడుదల చేయాలి. అట్టిపెట్టుకున్న (విత్‌ హెల్డ్‌) మిగిలిన 25 శాతం నిధులను ఉన్నతాధికారుల ఆమోదం పొందిన తర్వాతే చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అధికారుల ఆమోదం లేకుండానే అగ్రిమెంట్‌ లోని షెడ్యూల్‌-ఎ లోని (2, 9, 12, 20, 21) ఐటెమ్స్‌కు సంబంధించి ఈ 25 శాతం నిధులను కాంట్రాక్టర్‌కు విడుదల చేసేందుకు కిందిస్థాయి సిబ్బంది సిఫార్సు చేశారు.

అగ్రిమెంట్‌ నిబంధనల ప్రకారం బిల్లులను సరైన స్ర్కూటినీ చేయకుండానే అప్పటి పీఏవోలు డి.శ్రీనివాస రెడ్డి, పి.నాగేశ్వరరావు వాటిని ఆమోదించి కాంట్రాక్టర్‌కు చెల్లింపులు జరిపారు. మొత్తంగా రూ.1,60,03,336 విలు వైన పనులకు సంబంధించి ఈ బిల్లుల చెల్లింపులు జరిగినట్లు విజిలెన్స్‌ నిర్ధారించింది.

ఆరు ప్రభుత్వ జీవోల వివరాలివే..

జీవో ఎంఎస్‌ 27, 28: రిటైర్డ్‌ పీఏవోలు డి.శ్రీనివాస రెడ్డి, పి.నాగేశ్వరరావులపై ఏపీ రివైజ్డ్‌ పెన్షన్‌ రూల్స్‌- 1980 (రూల్‌ 9) కింద శాఖాపరమైన విచారణకు ప్రభు త్వం అనుమతి మంజూరు చేసింది.

జీవోఆర్టీ 376: ఈ వ్యవహారంలో అప్పటి డీఈఈ ఎ.రామకృష్ణ సహా ఏడుగురిపై ఉమ్మడిగా చర్యలు తీసుకుంటూ 2025 నవంబరు 13న ప్రభుత్వం జీవో 605 జారీ చేసింది. అయితే తాజా జీవో 376 ద్వారా ఆ ఏడుగురి జాబితా నుంచి ఈ ఇద్దరు పీఏవోలను తొలగించారు.

జీవో ఆర్టీ 377: పీఏవోలపై చర్యల కోసం గతంలో జారీ చేసిన జీవోలు 612, 613 లను ఈ జీవో ద్వారా రద్దు చేశారు.

జీవో ఆర్టీ 378, 379 : పాత జీవోల స్థానంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అప్పటి పీపీవోలు శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావులపై ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌ 1991 (రూల్‌-20) కింద వేర్వే రుగా అభియోగ పత్రాలు నమోదు చేస్తూ ప్రభుత్వం తాజా 378, 379 జీవోలను జారీ చేసింది.

పది రోజుల్లో వివరణ ఇవ్వాలి

ఈ అభియోగాలపై 10 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణను ప్రభుత్వానికి సమర్పించాలని ఆ ఇద్దరు రిటై ర్డ్‌ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. విచారణకు స్వ యంగా హాజరై వివరణ ఇచ్చుకోవాల నుకుంటున్నారో లేదో కూడా అందులో తెలపాలని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా స్పందించక పోయినా లేదా విచారణాధికారి ముందు హాజరుకాకపోయినా వారు చెప్పేదేమీ లేదని భావించి ఎక్స్‌-పార్టీగా విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ విషయంలో పై అధికారులపై రాజకీయ లేదా ఇతరత్రా ఎలాంటి ఒత్తిళ్లు తెచ్చినా ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌ 1964 (రూల్‌ 24) ఉల్లంఘనగా పరిగణించి అదనపు చర్యలు తీసుకుంటా మని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Updated Date - Jul 09 , 2026 | 11:22 PM