Share News

అగ్నికీలల్లో బైక్‌

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:24 AM

పట్టణంలోని జ్యోతీరావుపూలే పాఠశాల సమీపంలో మెయిన్‌ రోడ్డుపై బుధవారం ఓ ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతైంది.

 అగ్నికీలల్లో బైక్‌
కాలిపోతున్న ద్విచక్ర వాహనం

- చోదకుడు అప్రమత్తం

ఆమదాలవలస, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని జ్యోతీరావుపూలే పాఠశాల సమీపంలో మెయిన్‌ రోడ్డుపై బుధవారం ఓ ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతైంది. పొందూరు మండలం గోకర్ణపల్లి గ్రామానికి చెందిన అన్నెపు దిలీప్‌ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై సరుబుజ్జిలిలో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా బైక్‌లో మంటలు చెలరేగాయి. వెంటనేభయాందోళనతో వాహనాన్ని రోడ్డుపైనే ఆపేసి కిందకు దిగిప్రాణాలు కాపాడుకున్నాడు. క్షణాల్లో అగ్నికీలలు ఎగిసిపడి బైక్‌ మొత్తం అంటుకున్నాయి. సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంకు సిబ్బంది వచ్చి అగ్ని నివారణ పరికరంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా వీలుపడలేదు. సమాచారం అందుకున్న ఆమదాలవలస అగ్నిమాపక కేంద్రం ఎస్‌ఐ సనపల శ్రీనివాసరావు తన సిబ్బందితో వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే ద్విచక్ర వాహనం మొత్తం కాలిపోయింది.

Updated Date - Aug 20 , 2026 | 12:24 AM