Share News

ట్యాంకర్‌ను ఢీకొన్న బైక్‌.. ఒకరికి గాయాలు

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:28 AM

సరుబుజ్జిలి స్టేట్‌ బ్యాంకు సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఓ వ్యక్తి గాయపడా డు.

ట్యాంకర్‌ను ఢీకొన్న బైక్‌.. ఒకరికి గాయాలు
ట్యాంకర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం

సరుబుజ్జిలి, మార్చి 22(ఆం ధ్రజ్యోతి): సరుబుజ్జిలి స్టేట్‌ బ్యాంకు సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఓ వ్యక్తి గాయపడా డు. స్థానికులు తెలిపిన వివ రాలిలా ఉన్నాయి.. ఎల్‌ఎన్‌ పే ట మండలం తురకపేట గ్రా మానికి చెందిన బొడ్డేపల్లి స న్యాసిరావు భార్య భారతితో కలి సి ద్విచక్ర వాహనంపై సింగు పురం నుంచి తురకపేట వెళు తున్నారు. రోడ్డు విస్తరణ పను ల్లో భాగంగా కాంట్రాక్టర్‌కు చెం దిన నీటి ట్యాంకర్‌ స్టేట్‌ బ్యాం కు సమీపంలో ఆగి ఉంది. వె నుక నుంచి వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు నీటి ట్యాంక్‌ పక్క నుంచి వెళ్ల బోయి అదు పు తప్పి ట్యాంకర్‌ వెనుక భా గాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమా దంలో సన్యాసిరావు కాలికి గాయం కావడంతో 108 వాహనంలో ఆమదాలవలస 30 పడకల ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై పోలీసులకు వివరణ కోరగా శ్రీకాకుళం రిమ్స్‌ అవుట్‌పోస్టు పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగిందని, బాధితుడి వాంగ్మూలం అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 12:28 AM