బడ్జెట్‌లో జిల్లా అభివృద్ధికి పెద్దపీట
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:39 PM
స్వర్ణాంధ్ర సాధన దిశగా కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని, ఉత్తరాంధ్ర అభి వృద్ధికి అన్ని విధాలా ఈ బడ్జెట్ దోహదపడుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
అరసవల్లి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర సాధన దిశగా కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయని, ఉత్తరాంధ్ర అభి వృద్ధికి అన్ని విధాలా ఈ బడ్జెట్ దోహదపడుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌తో రాష్ట్రాభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నరకానికి చిరు నామాగా మారిన రోడ్లను నేడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తు న్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాకు అభివృద్ధికి కేటాయించిన నిధు ల్లో పెద్దపీట వేశారని, దీనివల్ల జిల్లా రూపురేఖలు మారను న్నాయన్నారు. ప్రత్యేకించి రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాజెక్టులో భాగం గా శ్రీకూర్మం నుంచి బలరాంపురం వరకు, బారువ తీరంలో కూడా రూ.1000 కోట్లతో ఈ ప్రాజెక్టుతో గొప్ప మార్పు రానున్నం దని అభిప్రాయపడ్డారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు 4 లైన్ల రహదారులతో మౌళిక వసతుల కల్పనలో గొప్ప ప్రగతి జరుగనుందని పేర్కొన్నారు. జిల్లాకు ఒక సైబర్ క్రైం పోలీసు స్టేషన్ రానుందన్నారు. అలాగే గ్రీన్ హైడ్రో జన్ ప్రాజెక్టు దేశంలో రెండు రాష్ట్రాలకే కేంద్రం కేటాయించిందని, అందులో మన రాష్ట్రం ఒకటన్నారు. పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర లక్ష్యం నెరవేరేందుకు కృషి జరు గుతోందన్నారు. అనంతరం మై టీడీపీ యాప్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, నేతలు అరవల రవీంద్ర, పీఎంజే బాబు, పాండ్రంకి శంకర్, మాదారపు వెంకటేష్, పీరుకట్ల విఠల్‌రావు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్
ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్
రణస్థలం, ఫిబ్ర వరి 16 (ఆంధ్ర జ్యోతి): ఉత్తరాంధ్ర అభి వృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌లో కేటాయిం పులున్నా యని ఎచ్చెర్ల ఎమ్మె ల్యే నడుకుదిటి ఈశ్వర రావు అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ.. పారిశ్రామిక, విద్య, తాగు నీరు, వ్యవ సాయం వైద్యం, ప్రజా సంక్షేమం, మహిళా సాధికారత దిశగా బడ్జెట్ ఉందన్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేలా బడ్జెట్ రూపొందించారన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర అన్ని విభాగాలకు నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. సంక్షేమ పథకా లు కొనసాగించడంతో పాటు కొత్త పథకాలు, ప్రోత్సా హకాలు రూపొందించేలా నిధులు కేటాయించారని చెప్పారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, కూటమి నేతలు చౌదరి బాబ్జీ, లంక శ్యామలరావు, ముప్పిడి సురేష్, కొమరాపు రవి, బెండు మల్లేశ్వరరావు, డీజీఎం ఆనందరావు, దెయ్యం శ్రీనివాసరావు, పిసిని జగన్నాఽథంనాయుడు తదితరులు పాల్గొన్నారు.