Share News

భోగాపురం ఎయిర్‌పోర్టుతో అభివృద్ధికి ఊతం

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:30 AM

ఉత్త రాంధ్ర సర్వతో ముఖాభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు ఎంతో దోహదం చేస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్టుతో అభివృద్ధికి ఊతం
ఎయిర్‌పోర్టు వద ్ద కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, ఎమ్మెల్యే శిరీషలతో ప్రజలు

  • ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఉత్త రాంధ్ర సర్వతో ముఖాభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు ఎంతో దోహదం చేస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. బుధవారం పలాస నియోజకవర్గ రైతులు, విద్యార్థులు, నాయకులతో కలసి ఆమె భోగాపురం ఎయిర్‌పోర్టును సందర్శించారు. ఆమెతో పాటు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ పలాసలో కూడా ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రైతులకు మార్కెట్‌ అనుసం ధానం, విద్యార్థులకు మెరుగైన రవాణా సౌకర్యం, వాణిజ్య కార్యకలాపాలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయ న్నారు. పలాస ప్రతిపాదిత విమానాశ్రయం త్వరితగతిన కార్యరూపం దాల్చితే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతు ందనే ఆశాభావాన్ని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు.

Updated Date - Aug 13 , 2026 | 12:30 AM