Share News

‘రిమ్స్‌లో మెరుగ్గా ఫిజియోథెరపీ సేవలు’

ABN , Publish Date - May 16 , 2026 | 12:01 AM

రోగులకు మరింత మెరుగైన ఫిజియోథెరపీ సేవలు అందుబాటులోకి వచ్చాయని, వీటిని సద్వి నియోగం చేసుకోవాలని రిమ్స్‌ వైద్య కళా శాల ప్రిన్సిపాల్‌ డా.కె.అప్పలనాయుడు, ఆసుపత్రి సూప రింటెండెంట్‌ డా.లుకలాపు ప్రసన్న కుమార్‌ కోరారు.

 ‘రిమ్స్‌లో మెరుగ్గా ఫిజియోథెరపీ సేవలు’
ఫిజియోథెరపీ పరికరాలను ప్రారంభిస్తున్న రిమ్స్‌ ప్రిన్సిపాల్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌

16 కొత్త పరికరాల ప్రారంభం

అరసవల్లి, మే 15(ఆంధ్రజ్యోతి): రోగులకు మరింత మెరుగైన ఫిజియోథెరపీ సేవలు అందుబాటులోకి వచ్చాయని, వీటిని సద్వి నియోగం చేసుకోవాలని రిమ్స్‌ వైద్య కళా శాల ప్రిన్సిపాల్‌ డా.కె.అప్పలనాయుడు, ఆసుపత్రి సూప రింటెండెంట్‌ డా.లుకలాపు ప్రసన్న కుమార్‌ కోరారు. శుక్రవారం ఫిజియోథెరపీ విభాగంలో కొత్త పరికరాలను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయ న్నారు. ఫిజియోథెరపిస్టులందరూ సమన్వయంతో పని చేయాల న్నారు. సుమారు రూ.6 లక్షల ఆసుపత్రి అభివృద్ధి నిధు లతో 16 రకాల పరికరాలను అందు బాటులోకి తీసుకు వచ్చా మన్నారు. వీటిని వినియోగించు కోవాలని కోరారు. కార్యక్రమంలో రిమ్స్‌ జేడీ, ఆర్థో వైద్యులు పార్థసారథి, ఏవో ప్రదీప్‌, ఫిజి యోథెరపీ వైద్యులు రవి, బాబ్జీ, సిబ్బంది విష్ణుప్రియ, ప్రశాంతి, కోరాడ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2026 | 12:01 AM