Share News

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:00 AM

Five village health clinics inaugurated in the district విలేజ్‌ హెల్త్‌క్లినిక్స్‌ ద్వారా గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు. జిల్లాలోని నరసన్నపేట-3, సారవకోట పీహెచ్‌సీ పరిధిలోని కిన్నెరవాడ, జి.సిగడాం మండలం బాతువ పీహెచ్‌సీ పరిధిలోని సేతు భీమవరం, శ్రీకూర్మం పీహెచ్‌సీ పరిధిలోని అంపోలు-3, ఎస్‌.మత్యలేశం గ్రామంలోని శ్రీకూర్మం-2 ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలను(విలేజ్‌ హెల్త్‌క్లినిక్స్‌) నిర్మించారు. మంగళవారం వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వర్చువల్‌గా వీటిని ప్రారంభించారు.

గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
విలేజ్‌హెల్త్‌ క్లినిక్‌ శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గొండు శంకర్‌ తదితరులు

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • జిల్లాలో ఐదు విలేజ్‌ హెల్త్‌క్లినిక్స్‌ ప్రారంభం

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌/ కల్చరల్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): విలేజ్‌ హెల్త్‌క్లినిక్స్‌ ద్వారా గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు. జిల్లాలోని నరసన్నపేట-3, సారవకోట పీహెచ్‌సీ పరిధిలోని కిన్నెరవాడ, జి.సిగడాం మండలం బాతువ పీహెచ్‌సీ పరిధిలోని సేతు భీమవరం, శ్రీకూర్మం పీహెచ్‌సీ పరిధిలోని అంపోలు-3, ఎస్‌.మత్యలేశం గ్రామంలోని శ్రీకూర్మం-2 ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలను(విలేజ్‌ హెల్త్‌క్లినిక్స్‌) నిర్మించారు. మంగళవారం వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వర్చువల్‌గా వీటిని ప్రారంభించారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాపరిషత్‌ కార్యాలయం వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌.. ఎమ్మెల్యేలు గొండు శంకర్‌, బగ్గు రమణమూర్తితో కలిసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘హెల్త్‌క్లినిక్స్‌ ద్వారా గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్యం, సాధారణ ఆరోగ్య పరీక్షలు, అవసరమైన మందుల పంపిణీ, తల్లి-శిశు ఆరోగ్య సేవలు, వ్యాధులపై అవగాహన, ఆరోగ్య పరిరక్షణ సేవలు స్థానికంగానే అందుబాటులోకి రానున్నాయి. డిజిటల్‌ సేవలు, 104 వాహన సేవలు, వ్యాక్సినేషన్‌ మొదలగు 12 రకాల సేవలు వీటిద్వారా అందనున్నాయి. 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. ఈ సెంటర్లలో కమ్యూనిటీ హెల్త్‌ అధికారి, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు రోగులకు సేవలందిస్తారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల’ని తెలిపారు. ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. గ్రామీణ ప్రజలకు వైద్యసేవలు మరింత చేరువ చేయడానికి ప్రాధాన్యమిస్తున్నాయని తెలిపారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ విలేజ్‌హెల్త్‌ క్లినిక్‌లు ప్రజలు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ఎన్‌.వి.నరేష్‌కుమార్‌, వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2026 | 12:00 AM