Share News

జిల్లావాసికి ఉత్తమ సేవా పతకం

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:12 AM

మండల పరిధి గోనెపాడు గ్రామానికి చెందిన కంచరాపు మురళీకృష్ణకు కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న ఉత్కృష్ట సేవా పతకం లభించింది.

జిల్లావాసికి ఉత్తమ సేవా పతకం
మురళీకృష్ణ

  • తెలంగాణ పోలీసుశాఖలో సేవలకు గుర్తింపు

  • మురళీకృష్ణకు ‘ఉత్కృష్ట’తో అరుదైన గౌరవం

సరుబుజ్జిలి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): మండల పరిధి గోనెపాడు గ్రామానికి చెందిన కంచరాపు మురళీకృష్ణకు కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న ఉత్కృష్ట సేవా పతకం లభించింది. తెలం గాణ రాష్ట్రంలోని మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్‌లో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మురళీకృష్ణ 15 ఏళ్ల పాటు అంకిత భావంతో, నిబద్ధతతో సేవలు అందించడంతో ఈ గౌరవం దక్కింది. 2011 జనవరి 14న రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పోలీసుశాఖలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మురళీకృష్ణ హైద రాబాదు సీఐడీ, మల్కాజిగిరి సీఐ తదితర విభాగాల్లో విధులు నిర్వ హించారు. క్రమశిక్షణ, అంకితభావం, ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ ఉన్నతాధికారులు ప్రశంసలు అందుకున్నారు. తన సేవలకు గుర్తిం పుగా తెలంగాణ పోలీసు సేవా పతకం, ప్రాథమిక శిక్షణ సమయం లో హోంమంత్రి పతకం, తెలంగాణ దశాబ్ధి పతకంతో పాటు పలు నగదు బహుమతులు, ప్రశంసలు అందుకున్నారు. మొత్తం 115 రి వార్డులు, 25 కమెండేషన్లు, పది ప్రశంసలు, 13 మెరిటోరియన్‌ సర్వీ స్‌ ఎంట్రీలు, 45 గుడ్‌ సర్వీస్‌ ఎంట్రీలు ఆయన సేవా ప్రస్తానంలో ప్రత్యేకంగా నిలిచాయి. ఇప్పుడు 2026 సంవత్సరానికి ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ ద్వారా ఉత్త ర్వులు అందుకున్నారు. మురళీకృష్ణకు ఈ గౌరవం లభించడంపై గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 12 , 2026 | 12:12 AM