Share News

బరంపురం టు బెంగళూరు

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:01 AM

ఒడిశా రాష్ట్రంలోని బరంపురం నుంచిబెంగళూరుకు అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న కర్ణాటక రాష్ట్రం జయపురానికి చెందిన రియాజ్‌ పాషాను శుక్రవారం మడపాం టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

 బరంపురం టు బెంగళూరు
గంజాయి తరలించిన నిందితుడితో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ గణేష్‌

గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు

నరసన్నపేట, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్రంలోని బరంపురం నుంచిబెంగళూరుకు అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న కర్ణాటక రాష్ట్రం జయపురానికి చెందిన రియాజ్‌ పాషాను శుక్రవారం మడపాం టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు బరంపురంలో ఒక వ్యక్తి నుంచి 8 కేజీల గంజాయిని రియాజ్‌ కొనుగోలు చేసి...ఒక ప్రైవేటు బస్సులో బెంగళూరుకు వెళుతున్నాడు. మడపాం టోల్‌ప్లాజా వద్ద బస్సు తనిఖీ చేయగా పోలీసులను చూసి బస్సు దిగి పారిపోయాడు. దేవాది జంక్షన్‌ వద్ద నిందితుడిని పట్టుకొని బ్యాగ్‌ తనిఖీ చేయగా 8 కేజీల గంజాయి ఉంది. ఈమేరకు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ గణేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

సైంట్రల్‌ జైలుకు సారవకోటవాసి

సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన సాకిపల్లి పవన్‌ కుమార్‌ గంజాయి అక్రమ రవాణా కేసులో నాలుగు సార్లు పోలీసులకు చిక్కాడు. దీంతో ప్రభుత్వ అనుమతితో అరెస్టు చేసి... విశాఖపట్నం సెంట్రల్‌ జైల్‌కు పంపించామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడు పవన్‌కుమార్‌పై నరసన్నపేట, పాతపట్నం, ఆమదాలవలస, ఎచ్చెర్ల పోలీసుస్టేషన్‌లో గంజాయి అక్రమ రవాణా కేసులు నమోదైనట్టు చెప్పారు. అదేపనిగా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన వారిపైచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Updated Date - Sep 12 , 2026 | 12:01 AM