చట్టాలపై అవగాహనతో ప్రయోజనం
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:37 AM
మహిళలకు రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని... ఇది ఎంతో ప్రయోజనకరమని జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎం.రోషిణి అన్నారు.
పాతపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మహిళలకు రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని... ఇది ఎంతో ప్రయోజనకరమని జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎం.రోషిణి అన్నారు. స్థానిక బీఆర్ అంబేడ్కర్ గురకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో గురువారం న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. బాల్య వివాహాల నియంత్రణ, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో ఏపీపీ గిరిజారాణి, సీఐ వెంకటరావు, ఎస్‌ఐ మధుసూధనరావు, తహసీల్దార్ బి.వెంకటరమణ, న్యాయవాది యుగంధర్, గురుకుల ప్రిన్సిపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.