బెల్టు షాపు నిర్వాహకుడి అరెస్టు
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:12 AM
స్థానిక వీరన్నాయుడు కాలనీలో బెల్టు దుకాణం నిర్వహిస్తున్న పెద్దిని రాంబాబు ఇంట్లో సోదాలు చేయగా ఆరు మద్యం సీసాలు లభ్యమైనట్లు ఎక్సైజ్‌శాఖ సీఐ టి.వెంకటప్పలనాయుడు తెలిపారు.
నరసన్నపేట, జూన్ 18(ఆంధ్రజ్యోతి): స్థానిక వీరన్నాయుడు కాలనీలో బెల్టు దుకాణం నిర్వహిస్తున్న పెద్దిని రాంబాబు ఇంట్లో సోదాలు చేయగా ఆరు మద్యం సీసాలు లభ్యమైనట్లు ఎక్సైజ్‌శాఖ సీఐ టి.వెంకటప్పలనాయుడు తెలిపారు. ఈమేరకు రాంబాబు పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. బెల్టు దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. ఈకార్యక్రమలో ఎస్‌ఐ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
పాతపట్నంలో...
పాతపట్నం, జూన్ 18(ఆంధ్రజ్యోతి): బెల్ట్‌షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్టు ప్రొహిబిషన్ ఎండ్ ఎక్సైజ్‌శాఖ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. పాతపట్నం ప్రొహిబిషన్ ఎండ్ ఎక్సైజ్‌శాఖ పరిధిలో గురువారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సారవకోట మండలం బురుజువాడలో ఒకరిపై, గోవర్ధనపురంలో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ దాడులలో 18 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్ట్‌షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడులలో పాతపట్నం మొబైల్ టీం సిబ్బంది పాల్గొన్నారు.
ఇచ్ఛాపురంలో...
ఇచ్ఛాఫురం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): రెండు బెల్ట్ షాపులపై దాడులు చేసి ఇద్దరి నిందితులను అరెస్ట్ చేశామని ఇచ్ఛాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ బి.మాధవరావు తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు గురువారం బెల్ట్ షాపులను నిర్వహిస్తున్న డొంకూరుకు చెందిన గురుమూర్తి, ఇద్దివానిపాలెంకు చెందిన జి. వెంకటేష్‌ను అరెస్ట్ చేశామని చెప్పారు.