మూడు నెలలుగా ఇక్కడే!
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:25 AM
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ కాలువల్లోని మురుగుతీసే యంత్రం మరమ్మతులకు గురై గత మూడు నెల లుగా ఇక్కడే మూలుగుతుంది. గతేడాది డిసెంబ రులో పల్లివీధిలో పనులు చేస్తుండగా మరమ్మ తులకు గురైంది.
మరమ్మతులకు గురైన మురుగు తొలగింపు యంత్రం
పట్టించుకోని యంత్రాంగం
కాలువల్లో పేరుకుపోతున్న వ్యర్థాలు
ఇబ్బందిపడుతున్న జంట పట్టణ ప్రజలు
కాశీబుగ్గ, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ కాలువల్లోని మురుగుతీసే యంత్రం మరమ్మతులకు గురై గత మూడు నెల లుగా ఇక్కడే మూలుగుతుంది. గతేడాది డిసెంబ రులో పల్లివీధిలో పనులు చేస్తుండగా మరమ్మ తులకు గురైంది. ఆ తర్వాత దీన్ని పట్టించుకోలేదు. దీంతో కాలువల్లో పేరుకుపోయిన మురుగు తొల గింపు పనులు నిలిచిపోయాయి. బీ-గ్రేడ్ మునిసి పాలిటీగా గుర్తింపు ఉన్న పలాస-కాశీబుగ్గలో పన్నుల రూపంలో లక్షలాది రూపాయల ఆదాయం వస్తోం ది. కానీ మౌలిక వసతులపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ యంత్రం పాడవ్వడంతో ప్రస్తుతం 31వార్డుల్లోని కాలువుల్లో మురుగు తొలగింపు పనులు నిలిచి పోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా ఈ యంత్రాన్ని బాగు చేసి మురుగు తొలగింపు పనులు చేపట్టాలని మునిసిపాలిటీ ప్రజలు కోరుతు న్నారు. దీనిపై కమిషనర్ శ్రీనివాసరావు మాట్లా డుతూ.. ఈ యంత్రం మరమ్మతులకు గురైం దని, దీనికి సంబంధించిన పార్టులు స్థానికంగా దొరకడం లేదన్నారు. త్వరలోనే దీనిని మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకువస్తాం.