ప్లాస్టిక్ రహిత గ్రామంగా దూసి
ABN , Publish Date - May 10 , 2026 | 11:54 PM
‘మన ఊరు-మన పరిశుభ్రత-మన బాధ్యత’ నినాదంతో వనసేన స్ఫూర్తిగా దూసి ఆర్‌ఎస్ గోల్డెన్ యూత్ గ్రామంలో ప్లాస్టిక్ నిర్మూలనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆదివారం దూసి ఆర్‌ఎస్‌లో ప్రత్యేకంగా ఐరన్‌తో తయారు చేసిన ప్లాస్టిక్ కలెక్షన్ యూనిట్‌ను ప్రారంభిం చారు.
గోల్డెన్ యూత్ ముందడుగు
ప్లాస్టిక్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటు
ఆమదాలవలస, మే 10 (ఆంధ్రజ్యోతి): ‘మన ఊరు-మన పరిశుభ్రత-మన బాధ్యత’ నినాదంతో వనసేన స్ఫూర్తిగా దూసి ఆర్‌ఎస్ గోల్డెన్ యూత్ గ్రామంలో ప్లాస్టిక్ నిర్మూలనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆదివారం దూసి ఆర్‌ఎస్‌లో ప్రత్యేకంగా ఐరన్‌తో తయారు చేసిన ప్లాస్టిక్ కలెక్షన్ యూనిట్‌ను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా యూత్ ప్రతినిధులు మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచ డంతో పాటు పర్యావరణ పరిరక్షణకు గాను గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే ఉద్దే శంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్లాస్టిక్ బాటిళ్లు, చాక్లెట్ కవర్లు తదితర ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా ప్రజలు ఈ కలెక్షన్ యూనిట్‌లో వేయాలని సూ చించారు. ఇలా సేకరించిన వస్తువులను రీ సైక్లింగ్ యూనిట్లకు పంపి పర్యావరణ పరిర క్షణకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామ న్నారు. గ్రామంలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని, దీనికి ప్రజలంతా సహకరించాలని గోల్డెన్ యూత్ సభ్యుడు ఎం.రాజశేఖర్ కోరారు. భవిష్యత్‌లో దూసి పంచాయతీ అంతా దీనిని అమలు చేస్తామన్నారు. ఎం.నిర్మల జ్ఞాపకార్థం రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఎంసీపీ రావు కుటుం బ సభ్యుల పేరిట ఈ యూనిట్ల ఏర్పాటుకు ప్రసాద్ మల్లపురెడ్డి సహకరించారన్నారని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో సంస్థ సభ్యులు గౌతమ్, రామకృష్ణ, శివ, రాజగోపాల్, ధనుంజయరావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.