Share News

మోసం చేశాడని..

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:52 PM

వ్యాపారంలో ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఒక ఆయిల్‌ కంపెనీకి చెందిన సేల్స్‌ఎగ్జిక్యూటివ్‌కు పైదుస్తులు లేకుండా చేసి దాడి చేసిన ఘటన నరసన్నపేటలో గురువారం చోటుచేసుకుంది.

 మోసం చేశాడని..
గాయపడిన సాగర్‌

సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌పై వ్యాపారి దాడి

నరసన్నపేట, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): వ్యాపారంలో ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఒక ఆయిల్‌ కంపెనీకి చెందిన సేల్స్‌ఎగ్జిక్యూటివ్‌కు పైదుస్తులు లేకుండా చేసి దాడి చేసిన ఘటన నరసన్నపేటలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నరసన్నపేటలో గల శాంతరామ ఏజెన్సీ యాజమాని ఉణ్న రమేష్‌... మెట్రో కంపెనీకి చెందిన సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ సాగర్‌ అనే వ్యక్తి ని ఆయిల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఏజెన్సీ వ్యాపార వ్యవహారాలపై మాట్లాడేందుకు ఫోన్‌ చేసి గోడౌన్‌కు పిలిపించారు. డబ్బులు తీసుకొని.. ఆయిల్‌ ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపిస్తూ రమేష్‌ తనను తీవ్రంగా కొట్టారని, తన దుస్తులు విప్పి మరీ దాడి చేశారని బాధితుడు సాగర్‌ తెలిపారు. వ్యాపారి ఉణ్న రమేష్‌ అమానవీయంగా సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌పై దాడిచేసి అవమానించారని ఆరోపిస్తూ కంపెనీ ప్రతినిధులు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తమ కంపెనీ ఉద్యోగిపై దాడికి పాల్పడిన వ్యాపారి రమేష్‌పై చట్టపరంగా చర్య తీసుకోవాలని నరసన్నపేట పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. సాగర్‌ ఆయిల్‌ పంపిస్తానని చెప్పి రూ.22 లక్షలు తీసుకొని రోజుల తరబడి ఇవ్వలేదనని వ్యాపారి రమేష్‌ తెలిపారు. ఎన్నిసార్లు అడిగినా స్పందించకపోవడంతో ఈరోజు పిలిపించి మాట్లాడినట్టు చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గణేష్‌ తెలిపారు.

Updated Date - Oct 08 , 2026 | 11:52 PM