Share News

మఖరజోలలో ఎలుగు హల్‌చల్‌

ABN , Publish Date - May 25 , 2026 | 11:58 PM

మందస మండలం మఖరజోల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఎలుగు బంటి హల్‌చల్‌ చేసింది.

మఖరజోలలో ఎలుగు హల్‌చల్‌
ఇంటి డాబాపై ఉన్న ఎలుగుబంటి

- డాబాలపైకి ఎక్కిన వైనం

హరిపురం, మే 25 (ఆంధ్రజ్యోతి): మందస మండలం మఖరజోల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఎలుగు బంటి హల్‌చల్‌ చేసింది. ఇళ్ల డాబాలపైకి ఎక్కి పరుగులు తీసింది. డాబాలపై నిద్రిస్తున్న వారు ఎలుగును చూసి టార్చలైట్లు వేస్తూ కేకలు పెట్టారు. దీంతో ఎలుగు పరుగు లఖించి డాబాలపై నుంచి కిందకి దూకి సమీప తోటల్లోకి పారిపో యింది. ఈ గ్రామం పక్కనే ఉన్న అల్లిమెరకలో గ్రామదేవత ఉత్సవాలు జరుగుతున్నాయి. అటుగా వెళ్లిన ఎలుగును గ్రామస్థులు తరిమివేయడంతో మఖరజోల వైపు వచ్చి మెట్ల మీదుగా డాబాలపైకి వెళ్లింది. ఈ రెండు గ్రామాల్లో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. అటవీ అధికారులు స్పందించి ఎలుగుల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 25 , 2026 | 11:58 PM