అనకాపల్లిలో ఎలుగుబంటి కలకలం
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:44 AM
అనకాపల్లిలో శుక్ర వారం రాత్రి ఎలుగుబంటి కలకలం సృష్టించింది.
వజ్రపుకొత్తూరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లిలో శుక్ర వారం రాత్రి ఎలుగుబంటి కలకలం సృష్టించింది. మామిడి చెట్టు పైకి ఎక్కి రెండు గంటల పాటు తిష్ట వేయడంతో గ్రామస్థులు భయంతో వణికిపోయారు. శుక్రవారం రాత్రి గ్రామానికి సమీపంలో గల తోటల్లో తిరుగుతున్న ఎలుగుబంటిని కుక్కలు వెంబడించాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు స్థానిక బస్టాండ్ వద్ద గల మామిడి చెట్టుపైకి ఎక్కి కూర్చుంది. దీంతో గ్రామస్థులు హడలిపోయి... బయటకు వచ్చేందుకు భయపడ్డారు. సుమారు రెండు గంటల తరువాత కిందకి దిగి తోటల్లోకి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు ఎలుగుబంటి దాడిలో మృతిచెందగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ఎలుగుబంట్లు కనిపిస్తే గ్రామస్థులు వణికిపోతున్నారు. అటవీ శాఖాధికారులు స్పందించి ఎలుగుబంట్ల సంచారాన్ని అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.