వేసవిలో అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:26 AM
వేసవిలో అగ్నిమాపక సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపకశాఖ అఽధికారి మోహనరావు అన్నారు.
జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి మోహనరావు
నరసన్నపేట, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): వేసవిలో అగ్నిమాపక సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపకశాఖ అఽధికారి మోహనరావు అన్నారు. సోమవారం స్థానిక అగ్నిమాపక కార్యాలయం వద్ద అగ్నిమాపక వారోత్సవాలు ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విపత్తు సమయాల్లో అగ్నిమాపక సిబ్బంది అందించే సేవలను కొనియాడారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలను అందించి నిబదతగా పనిచేసేది అగ్నిమాపక సిబ్బంది, అధికారులేనని అన్నారు. కార్యక్రమంలో కాళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, కళింగ కోమటి కార్పొరేషన్ డైరెక్టర్ జామి వెంకట్రావు, తహసీల్దార్ పి.సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.