Share News

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Apr 28 , 2026 | 11:54 PM

బ్యాంకింగ్‌ సేవలు, పొదుపు పథకాల పై అవగాహన కలిగి ఉండి సైబర్‌ మోసాల బారినపడ కుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ పేడాడ శ్రీనివాసరావు అన్నారు.

 సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌ శ్రీనివాసరావు

లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాసరావు

అరసవల్లి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): బ్యాంకింగ్‌ సేవలు, పొదుపు పథకాల పై అవగాహన కలిగి ఉండి సైబర్‌ మోసాల బారినపడ కుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ పేడాడ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా శిశు సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఐసీడీఎస్‌ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలు ఒక్కొక్కరి పేరున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20 లక్షలు వేశాయని, వారందరూ ఇప్పుడు 18 ఏళ్లు పూర్తి చేసుకుని, తమ అకౌంట్లను సొంతంగా వినియోగించే స్థాయికి చేరుకున్నారన్నారు. వారికి ప్రతి నెలా డిపాజిట్లపై రూ.10 వేల వడ్డీ వస్తుందని, ఆ మొత్తాన్ని వారి చదువు, చక్కని భవిష్యత్‌కు వినియోగిం చుకోవాలని కోరారు. చెడు వ్యస నాల బారిన పడకుండా, సైబర్‌ మోసాలకు గురికాకుండా ఆ మొత్తాన్ని వారి వ్యక్తిగత అభివృద్ధి కోసం వినియోగించుకోవడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కోఆర్డి నేటర్‌ ఉమామహేశ్వరి, డీసీపీవో కేవీ రమణ, బాలల రక్షణ అధికారులు ఇప్పిలి లక్ష్మీ నాయుడు, మెట్ట మల్లేశ్వరరావు, తలే లక్ష్మణరావు, ధర్మాన సీతారాములు, మధుర మీనాక్షి, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 11:54 PM