ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:39 PM
నెలరోజుల పాటు ఈనెల 14 నుంచి నిర్వహించనున్న ఎస్‌ఐఆర్ పక్రియ సమయంలో బీఎల్వోలు అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల జాబితాలపై అవగాహన ఉండాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు.
నరసన్నపేట, జూన్ 8(ఆంధ్రజ్యోతి): నెలరోజుల పాటు ఈనెల 14 నుంచి నిర్వహించనున్న ఎస్‌ఐఆర్ పక్రియ సమయంలో బీఎల్వోలు అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల జాబితాలపై అవగాహన ఉండాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. సోమవారం నరసన్నపేటలో నియోజకవర్గ టీడీపీ బీఎల్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఎల్‌ఏలు బీఎల్‌వోలతో సమన్వయంగా పనిచేస్తూ ఓటర్ల వివరాలను పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన, పొందరి కురాకుల కార్పొరేషన్ చైర్మన్ దామోదర నర్సింహాలు, కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, కళింగ కోమటి కార్పొరేషన్ డైరెక్టర్ జామి వెంకట్రావు, నరసన్నపేట, జలుమూరు మండల టీడీపీ అధ్యక్షులు అడపా చంద్రశేఖర్, వెలమల రాజేంద్రనాయుడు, శిమ్మ చంద్రశేఖర్, గొద్దు చిట్టిబాబు, టీఎన్ ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు బలగ ప్రహార్ష పాల్గొన్నారు.
క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. నరసన్నపేటలో జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో ప్రతిభ కనపరిచిన నియోజవర్గంలోని విద్యార్థులకు అభినందించారు.