Share News

అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 31 , 2026 | 11:52 PM

నగరంలోని పెద్దరెల్లి వీధిలో ఆదివారం టూ టౌన్‌ సీఐ ఈశ్వరరావు నేతృత్వంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అపరిచితులపై అప్ర మత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

అప్రమత్తంగా ఉండాలి
కార్డన్‌సెర్చ్‌ సందర్భంగా సిబ్బందికి సూచనలిస్తున్న సీఐ ఈశ్వరరావు

కార్డన్‌ సెర్చ్‌లో సీఐ ఈశ్వరరావు

ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాల సీజ్‌

శ్రీకాకుళం క్రైం, మే 31 (ఆంధ్రజ్యోతి): నగరంలోని పెద్దరెల్లి వీధిలో ఆదివారం టూ టౌన్‌ సీఐ ఈశ్వరరావు నేతృత్వంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అపరిచితులపై అప్ర మత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, గంజాయి, మద్యం ఇతర అనధికార పేలుడు పదార్థాల అక్రమ నిల్వల నిరోధానికి గాను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ధ్రువీకరణ పత్రాలు లేని 10 ద్విచక్ర వాహ నాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం సబ్‌ డివిజన్‌ పరిధిలోని సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. అనుమానిత వ్యక్తులు తారస పడితే వెంటనే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్ర మంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

‘సత్ప్రవర్తనతో మెలగాలి’

శ్రీకాకుళం క్రైం, మే 31 (ఆంధ్రజ్యోతి): నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో నడుచు కోవాలని టూటౌన్‌ సీఐ ఈశ్వరరావు, వన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ అన్నారు. ఆదివారం వన్‌టౌన్‌, టూటౌన్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. కౌన్సిలింగ్‌ ఆదివారం నిర్వహించారు. నగరంలోని వన్‌టౌన్‌, టూటౌన్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు.

Updated Date - May 31 , 2026 | 11:52 PM