Share News

బడ్జెట్‌లో బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యం

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:22 PM

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిందని,

బడ్జెట్‌లో బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యం
మాట్లాడుతున్న రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండా శంకర్‌ రెడ్డి

ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 17‘(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిందని, దీంతో ఆయా వర్గాల అభివృద్ధికి దోహదం చేస్తుందని రాష్ట్ర రెడ్డిక కార్పొ రేషన్‌ చైర్మన్‌ కొండా శంకర్‌ రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగ ళవారం సంఘ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల సంక్షేమానికి గణనీయమైన నిధులు కేటా యించారన్నారు. 2025-26లో రూ.47,456 కోట్లు కేటాయించగా.. 2026-27 బడ్జెట్‌లో రూ. 51,021 కోట్లు కేటాయించి కూటమి ప్రభుత్వం బీసీ వర్గాల కు మేలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘ నేతలు శంకర్‌ నారాయణ, జోగారెడ్డి, ప్రసాద్‌ రెడ్డి, పురు షోత్తం రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 11:22 PM