26న బార్ అసోసియేషన్ ఎన్నిక
ABN , Publish Date - Mar 18 , 2026 | 11:49 PM
జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి కంచరాన నాగభూషణరావు ఒక ప్రకటనలో తెలిపారు.
శ్రీకాకుళం లీగల్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి కంచరాన నాగభూషణరావు ఒక ప్రకటనలో తెలిపారు. గతం లో 27న ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ప్రకటించామని, అయితే ఆ రోజున శ్రీరా మనవమి సెలవు దినం కావడంతో ఒకరోజు ముందు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొ న్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మా నించినట్లు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసేనాటికి అధ్యక్ష స్థానానికి 2, ఉపాధ్యక్ష స్థానానికి 3, జాయింట్ సెక్రటరీకి 2 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. మిగిలిన పదవు లకు ఒక్కో నామినేషన్ దాఖలైనట్లు పేర్కొన్నారు. ఎన్నిక తేదీ మార్పును సభ్యులు గమనిం చాలని ఆయన సూచించారు.