Share News

బ్యాంకుల బంద్‌ విజయవంతం

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:42 AM

Bank employees demand resolution of issues యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌ పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలో అన్ని బ్యాంకుల బ్రాంచ్‌లు మూతపడ్డాయి. బంద్‌ విజయవంతంగా సాగింది. శ్రీకాకుళంలోని జీటీ రోడ్డులో ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ ఆవరణలో వివిధ బ్యాంకుల ఉద్యోగులు, నాయకులు ధర్నా చేశారు.

బ్యాంకుల బంద్‌ విజయవంతం
శ్రీకాకుళం ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ వద్ద ధర్నా చేస్తున్న బ్యాంకు ఉద్యోగులు

సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల డిమాండ్‌

అరసవల్లి/ పాత శ్రీకాకుళం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌ పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలో అన్ని బ్యాంకుల బ్రాంచ్‌లు మూతపడ్డాయి. బంద్‌ విజయవంతంగా సాగింది. శ్రీకాకుళంలోని జీటీ రోడ్డులో ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ ఆవరణలో వివిధ బ్యాంకుల ఉద్యోగులు, నాయకులు ధర్నా చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకు ఉద్యోగ, అధికారుల సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ కేసీహెచ్‌ వెంకటరమణ మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం వారానికి 5 రోజుల పనిదినాలను అమలు చేస్తామని చేసిన ఒప్పందాన్ని తక్షణం అమలు చేయాలి. వర్క్‌మెన్‌ డైరెక్టర్‌ నియామకం చేపట్టాలి. గ్రాట్యూటీ పరిమితి పెంచాలి. పెన్షన్‌ అప్‌డేషన్‌ చేపట్టాలి. పని ఒత్తిడి తగ్గించాలి. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. లేదంటే ఈ నెల 28, 29, 30 తేదీలలో సమ్మె చేపడతామ’ని తెలిపారు. అక్టోబరు 26 నుంచి నిరవధిక సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐబీఓసీ నాయకుడు పి.క్రిష్ణకిషోర్‌, సీఐటియు, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎస్‌ఐసీ, పోస్టల్‌, ఎస్‌బీఐ పెన్షనర్ల సంఘం నాయకులు, అన్ని బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.



Updated Date - Sep 12 , 2026 | 12:42 AM