Share News

ఏబీపీవీ పిలుపుతో కళాశాలల బంద్‌

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:56 PM

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ను తక్ష ణం విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఏబీపీవీ పిలుపుతో కళాశాలల బంద్‌
నరసన్నపేటలో ఓ కళాశాల నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ను తక్ష ణం విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్‌తో బుధవారం ప్రైవేటు జూనియర్‌, డిగ్రీ కళాశాలలు బంద్‌ పాటించాయి. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మదన్‌కుమార్‌ మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహా రం అందించాలని కోరారు. జిల్లాకు ఒకటి చొప్పున ప్రభుత్వం ఇంజనీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని, జీవో నెంబరు 77 రద్దు చేసి ఫీజీ విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌ మెంట్‌ చెల్లించాలని, జూనియర్‌ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కొన్ని కళాశాలలు ముందు సెలవులు ప్రకటించగా మరికొన్ని ఏబీవీపీ ప్రతినిధులు వచ్చిన తరువాత తరగతులను రద్దు చేసి బంద్‌కు సహకరించాయి. శ్రీకాకుళం నగరంతో పాటు నరసన్నపేట, టెక్కలి, సోంపేట, పాతపట్నం, ఆమదాలవలస, హరిపురం తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు కళాశాలలు బంద్‌తో మూతపడ్డాయి.

Updated Date - Aug 05 , 2026 | 11:56 PM