స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులు
ABN , Publish Date - Nov 06 , 2026 | 12:34 AM
): శ్రీకాకుళం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించనున్నారు. ఈమేరకు రిసెప్షన్ కేంద్రానికి బ్యాలెట్ బాక్సులు గురువారం సాయంత్రం ఎన్నికలు పూర్తయ్యాక తీసుకువచ్చారు.
ఎచ్చెర్ల రూరల్, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించనున్నారు. ఈమేరకు రిసెప్షన్ కేంద్రానికి బ్యాలెట్ బాక్సులు గురువారం సాయంత్రం ఎన్నికలు పూర్తయ్యాక తీసుకువచ్చారు. డివిజన్‌పరిధిలోని ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల, జి.సిగ డాం, గార, జలుమూరు, లావేరు, నరసన్నపేట, పోలాకి, పొందూరు, రణస్థ లం, సరుబుజ్జలి, శ్రీకాకుళంరూరల్ మండలాల బ్యాలెట్ బాక్సులు రిసెప్షన్ కేంద్రాల్లో స్వీకరణ అనంతరం స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఈ మేరకు 14 స్ట్రాంగ్ రూములు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాలు, ఇతర సౌకర్యాలు కల్పించారు. షార్ట్‌సర్క్యూట్‌కు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నారు. రాజకీయ పార్టీలు ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంతో స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులు భద్రపరిచి, తాళాలకు సీళ్లు వేశారు. శనివారం ఉదయం కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా కౌంటింగ్ హాళ్లు ఏర్పాటుచేశారు.