విద్యారంగ సంస్కరణలకు ఆద్యుడు ‘ఆజాద్’
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:40 PM
దేశంలో విద్యారంగ సంస్కరణలు చేపట్టి విద్యాభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ అని ఏఎస్పీ శ్రీనివాస రావు అన్నారు.
ఏఎస్పీ శ్రీనివాసరావు
శ్రీకాకుళం క్రైం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): దేశంలో విద్యారంగ సంస్కరణలు చేపట్టి విద్యాభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ అని ఏఎస్పీ శ్రీనివాస రావు అన్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు ఆజాద్ జయంతిని బుధ వారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఏఎస్పీ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. తొలి కేంద్ర విద్యాశా ఖామంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధికి చేసిన సేవలను గుర్తించి 1992లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చి గౌరవించిం దన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకో వాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌ఐ కె.నరసిం గరావు, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘స్ఫూర్తిప్రదాత మౌలానా అబుల్ కలాం ఆజాద్’
పాత శ్రీకాకుళం నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న దృఢ సంకల్పంతో స్వాతంత్ర్యానంతరం విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు మౌలా నా అబుల్ కలాం ఆజాద్ అని వక్తలు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి విద్యా శాఖమంత్రి, భారతరత్న అబుల్ కలాం ఆజాద్ జయంతిని బుధవారం నిర్వహించారు. శాంతినగర్ కాలనీలోని గాంధీ స్మృతివనంలో ఆజాద్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ఐఐటీలు, యూజీసీ తదితర విద్యా సంస్థలు నెలకొల్పేందుకు కృషి చేసి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారన్నారు. కార్యక్రమం లో మహీబుల్లాఖాన్, డిగ్రీ కాలేజీ లెక్చరర్ సైదాభాను, కొంక్యాన మురళీధర్, మహమ్మద్ షాన్‌వాజ్, మందిరం ప్రతినిధులు బరాటం లక్ష్మణరావు, చౌదరి రాధాకృష్ణ, పైడి హర నాథరావు, డా.అదీబ్, ఇందిరా ప్రసాద్, ఎంవీవీఎస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు
‘విద్యకు పునాది వేసిన మహనీయుడు ఆజాద్’
అరసవల్లి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): భారతదేశంలో ఉన్నత విద్యాభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు అన్నారు. ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో బుధవారం భారత రత్న మౌలానా అబుల్ కలాం 138వ జయంతిని నిర్వహించారు. ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ నిబద్ధత, నిజాయితీతో చేపట్టిన కార్యక్రమాలు ఆదర్శప్రాయమన్నారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్య క్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్, నేతలు కేవీఎల్‌ఎస్ ఈశ్వరి, చాంద్ భాషా, పి.రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.