Share News

అయోడిన్‌ లోప నివారణపై అవగాహన

ABN , Publish Date - Nov 04 , 2026 | 11:33 PM

అయోడిన్‌ లోపం వల్ల వచ్చే వ్యాధులపై ప్రతిఒక్కరికీ అవగాహన అవసరమని డీఎంహెచ్‌వో డా.నరేష్‌కుమార్‌ అన్నారు.

అయోడిన్‌ లోప నివారణపై అవగాహన
వ్యాసరచన పోటీ విజేతకు బహుమతి అందిస్తున్న డీఎంహెచ్‌వో డా.నరేష్‌కుమార్‌

డీఎంహెచ్‌వో డా.నరేష్‌కుమార్‌

శ్రీకాకుళం కల్చరల్‌, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): అయోడిన్‌ లోపం వల్ల వచ్చే వ్యాధులపై ప్రతిఒక్కరికీ అవగాహన అవసరమని డీఎంహెచ్‌వో డా.నరేష్‌కుమార్‌ అన్నారు. జాతీయ అయోడిన్‌ డెఫిషియెన్సీ డిజార్డర్స్‌ కంట్రోల్‌ ప్రోగ్రాంలో భాగంగా అవగాహనా వారోత్సవాలను బుధవారం నగరం లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయోడిన్‌లోపం వల్ల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని, గాయిటర్‌ రావొచ్చని, మాన సిక వికాస లోపాలు తలెత్తవచ్చన్నారు. దీని నివారణకు అయోడైజ్డ్‌ ఉప్పును వినియోగించాలని సూచించారు. అయోడిన్‌తో కూడిన ఉప్పును గాలి చొరబడని కంటైనర్‌లో భద్రపరచాలన్నారు. దీనిపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని కోరారు. అయోడిన్‌ లభించే గుడ్లు, పాలు, సముద్ర చేపలు తినాలన్నారు. విద్యార్థినులకు నిర్వహించిన వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డా.శివ రంజని, హెచ్‌ఎం సుజాత, ఫ్లోరోసిస్‌ కన్సల్టెంట్‌ అరుణ జ్యోతి, అప్పారావు, సైకాలజిస్టు సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 11:33 PM