Share News

న్యూమోనియా నివారణపై అవగాహన

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:07 AM

న్యూమో నియా నివారణపై అవగాహన కలిగి ఉండి గ్రామాల్లో చైతన్యం కలి గించాలని డీఎం హెచ్‌వో డా. నరేష్‌కుమార్‌ అన్నారు. ప్రపంచ న్యూమోనియా దినం సందర్భంగా గురు వారం తన చాంబర్‌లో న్యూమోనియా పోస్టర్‌ను ఆవిష్కరించారు.

న్యూమోనియా నివారణపై అవగాహన
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డా.నరేష్‌కుమార్‌

డీఎంహెచ్‌వో డా.నరేష్‌కుమార్‌

శ్రీకాకుళం కల్చరల్‌, నవం బరు 12(ఆంధ్రజ్యోతి): న్యూమో నియా నివారణపై అవగాహన కలిగి ఉండి గ్రామాల్లో చైతన్యం కలి గించాలని డీఎం హెచ్‌వో డా. నరేష్‌కుమార్‌ అన్నారు. ప్రపంచ న్యూమోనియా దినం సందర్భంగా గురు వారం తన చాంబర్‌లో న్యూమోనియా పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. న్యూమోనియా ఊపిరి తిత్తులకు సోకే తీవ్రమైన ఇన్‌ ఫెక్షన్‌ అని అన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వారికి, వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్నవారికి, దీర్ఘకాలిన వ్యాధిగ్రస్థులకు న్యూమో నియా సోకే ప్రమాదం ఉందన్నారు. వ్యాధి లక్షణాలను ముందస్తుగా గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చ న్నారు. న్యూమోనియా వ్యాధి లక్షణాలు, నివా రణా చర్యలపై ప్రజలకు అవగాహన కలిగిం చాలని సూచించారు. చిన్నారుల్లో దగ్గు, జ్వరం, వేగంగా శ్వాస తీసుకోవడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీ పంలోని ప్రభుత్వ ఆసుప త్రిలో వైద్య సేవలు పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమం లో ఏవో పి.ప్రదీప్‌, జిల్లా సర్వెలైన్స్‌ అధికారి డా.పి.సుజాత, హెచ్‌ఈవో ముఖలింగం, డిప్యూ టీ హెచ్‌ఈవో పి.మోహిని రత్నకుమారి తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2026 | 12:07 AM