సామాజిక భద్రత చట్టంపై అవగాహన అవసరం
ABN , Publish Date - Jul 17 , 2026 | 11:26 PM
సామా జిక భద్రత చట్టం-2020పై కార్మికులు అవగహన కలిగి ఉండా లని విశాఖపట్నం ఈఎస్‌ఐసీ ఉప ప్రాంతీయ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ వేమూరి శ్యామ్ ప్రసాద్ అన్నారు.
ఈఎస్‌ఐసీ ఏడీ శ్యామ్‌ప్రసాద్
రణస్థలం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): సామా జిక భద్రత చట్టం-2020పై కార్మికులు అవగహన కలిగి ఉండా లని విశాఖపట్నం ఈఎస్‌ఐసీ ఉప ప్రాంతీయ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ వేమూరి శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఏవోఎల్ పరి శ్రమలో శుక్రవారం కాంట్రాక్టర్లు, కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా అమలులోకి వచ్చిన సామాజిక భద్రత కోడ్ వేతన వివరణ మార్చడంతో అధిక సంఖ్యలో కార్మికులకు ఈఎస్‌ఐసీ (కార్మిక రాజ్య బీమా సంస్థ) సేవలు కిందకు రానున్నాయన్నారు. ఈఎస్‌ఐ సీలో కలుగు ప్రయోజనాలు, కొత్తగా పొందుపరిచిన సామాజిక భద్రతా చట్టం-2020 తదితర అంశా లను వివరించారు. ఈ చట్టం ద్వారా కార్మికులకు అనేక ఈఎస్‌ఐసీ సౌకర్యాలు కలుగనున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్ర మంలో ఏవోఎల్ పరిశ్రమ హెచ్‌ఆర్ మేనేజర్ సీహెచ్ భాస్కరరావు, ఈఎస్‌ఐ మేనేజర్ శ్రీప్రజ్ఞ, జీవరత్నం తదితరులు పాల్గొన్నారు.