Share News

మలేరియా, డెంగ్యూపై అవగాహన అవసరం

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:04 AM

దోమల ద్వారా వ్యాప్తిచెందే మలేరియా, డెంగ్యూపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా మలే రియా అధికారి పీవీ సత్యనారాయణ అన్నారు.

మలేరియా, డెంగ్యూపై అవగాహన అవసరం
ర్యాలీకి జెండా ఊపి ప్రారంభిస్తున్న డీఎంవో సత్యనారాయణ

జిల్లా మలేరియా అధికారి పీవీ సత్యనారాయణ

శ్రీకాకుళం కల్చరల్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి: దోమల ద్వారా వ్యాప్తిచెందే మలేరియా, డెంగ్యూపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా మలే రియా అధికారి పీవీ సత్యనారాయణ అన్నారు. ప్రపంచ దోమల దినం సందర్భంగా గురువారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో కార్యా లయం వద్ద ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ఏడు రోడ్ల జంక్షన్‌ వరకు సాగింది. దోమల రహిత జిల్లాగా శ్రీకాకుళాన్ని చేసేందుకు కృషి చేస్తామని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఎం హెచ్‌వో డా.శివరంజని, డా.సుజాత, ఎస్‌.శ్రీనివాసరావు, మోహిని, సూర్యం, చినవాడు, నరసింగరావు, యూపీహెచ్‌సీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, మలేరి యా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:04 AM