‘పోలీస్ ఆంత్రిక్ సురక్ష సేవాపథక్’ పతకాల ప్రదానం
ABN , Publish Date - May 23 , 2026 | 11:19 PM
దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో విశిష్ట సేవలు అం దించిన జిల్లా పోలీస్ శాఖకు చెందిన 118 మంది పోలీస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకమైన పోలీస్ ఆంత్రిక్ సుర క్షా సేవా పథక్-2022 అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఎంపికైన పోలీస్ సిబ్బందికి పతకాలు ప్రదానం చేసి అభినందించారు.
శ్రీకాకుళం క్రైం, మే 23 (ఆంధ్రజ్యోతి): దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో విశిష్ట సేవలు అం దించిన జిల్లా పోలీస్ శాఖకు చెందిన 118 మంది పోలీస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకమైన పోలీస్ ఆంత్రిక్ సుర క్షా సేవా పథక్-2022 అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఎంపికైన పోలీస్ సిబ్బందికి పతకాలు ప్రదానం చేసి అభినం దించారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో కనీసం రెండేళ్ల పాటు అంతర్గత భద్రతా విధుల్లో సమర్థవంతంగా సేవలందించిన పోలీస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందిస్తోం దన్నారు. విధి నిర్వహణ లో చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావా నికి గుర్తింపుగా ఈ పుర స్కారాలు లభించడం ఆనందంగా ఉందన్నారు.
కమ్యూనికేషన్ అధికారులు, సిబ్బందికి అభినందన
జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఆధ్యాత్మిక ఉత్సవాలు, జాతర లు, గ్రామోత్సవాలు, వీఐపీ, వీవీఐపీల పర్యటనల నేపథ్యంలో కమ్యూ నికేషన్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించి ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అభినందిం చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశం లో ఈ అంశాల్లో ప్రతిభ చూసిన కమ్యూనికేషన్ విభాగం ఇన్‌స్పెక్టర్ షేక్ జబీరుద్దీన్‌సాబిర్, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించి వారిందిన సేవలను కొనియాడారు. పోలీస్‌శాఖలో కమ్యూనికేషన్ వ్యవస్థ శాంతి భద్రతల నిర్వహణకు వెన్నెముక వంటిదన్నారు. జిల్లాలో జరిగిన వివిధ కార్యక్ర మాలు, ప్రముఖుల పర్యటనల నేపథ్యంలో సవాళ్లతో కూడిన సేవలు అందించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు, పోలీస్ అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.