ఉచిత ఫిజియోథెరపీ సేవలు వినియోగించుకోండి
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:05 AM
ఉచిత ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సత్యసాయి సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు కోరారు.
సత్యసాయి సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు
శ్రీకాకుళం కల్చరల్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఉచిత ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సత్యసాయి సంస్థల రాష్ట్ర అధ్య క్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు కోరారు. నగరంలోని జడ్పీ ఎదురుగా ఉన్న ఏపీహెచ్‌బీ కాల నీ సత్యసాయి మందిరంలో ఉచిత ఫిజియో థెరపీ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ తరహా ఉచిత కేంద్రం ఏర్పాటు రాష్ట్రంలోనే మొదటిదన్నారు. ఈ కేంద్రంలో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశామని, నిపుణులైన ఫిజియోఽథెరపిస్ట్ ఆధ్వర్యంలో ఈ సేవలు నిర్వహిస్తున్నామని నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాకు ళం రూరల్ సీఐ పైడపునాయుడు, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు, వైద్యులు టి.బాలకృష్ణ, టి.విశ్వ నాథం, ప్రసాద్, కె.భాస్కరరావు, మందిరం నిర్వాహ కులు పాల్గొన్నారు.