ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:42 AM
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ అంతరకుడ్డ గ్రామం వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
పలాస, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ అంతరకుడ్డ గ్రామం వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షత గాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చే ర్పించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం సా యంత్రం నువ్వలరేవు గ్రామం నుంచి కాశీబుగ్గ వైపు వస్తున్న ఆటో ప్రమాదవశాత్తు అంతరకు డ్డ గ్రామ సమీపంలో ఉన్న తాళ్లచెరువు వద్ద బోల్తాపడింది. సమీప పొలాల్లో ఆటో దూసుకు వెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న నగరంపల్లి గ్రామానికి చెందిన దువ్వాడ భాస్కరరావు, కిడిసింగి గ్రామానికి చెందిన నరసమ్మ, అంతర కుడ్డ గ్రామానికి చెందిన కోరమ్మకు దెబ్బలు తగిలాయి. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు.