Share News

ఆటో-బైక్‌ ఢీ.. ఆరుగురికి గాయాలు

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:26 AM

తలగాం జంక్షన్‌ వద్ద సో మవారం ఆటో, ద్విచక్ర వాహనం ఢీకున్నాయి.

ఆటో-బైక్‌ ఢీ.. ఆరుగురికి గాయాలు
చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

టెక్కలి/రూరల్‌, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): తలగాం జంక్షన్‌ వద్ద సో మవారం ఆటో, ద్విచక్ర వాహనం ఢీకున్నాయి. ఈ ఘటనలో ఆటో బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు.. 108 వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నౌపడాకు చెందిన పి.కల్యాణి, కె.అప్పారావు, భావనపాడుకు చెందిన ఎన్‌.రాజేశ్వరి, ఎరకన్నపేటకు చెందిన సీహెచ్‌ గవిరేసు, ఐ.లచ్చోడు, పాతనౌపడకు చెందిన బి.జయరాం గాయపడ్డారు. వీరికి జిల్లా కేంద్రాసుపత్రిలో వైద్యులు చికిత్సలు అందించారు. టెక్కలి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:26 AM