Share News

ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య కేసులో

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:20 PM

చిన్నలోగిడి గ్రామానికి చెందిన దయానిధి సోయి(32) అనే ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య కేసులో పెద్దలోగిడికిచెందిన జయనవలస చిలకమ్మ అనే ఆశావర్కర్‌కు, ఆమె భర్త మొఖలింగానికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.

 ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య కేసులో

ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య కేసులో

నిందితులకు 14 రోజుల రిమాండ్‌

పాతపట్నం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): చిన్నలోగిడి గ్రామానికి చెందిన దయానిధి సోయి(32) అనే ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య కేసులో పెద్దలోగిడికిచెందిన జయనవలస చిలకమ్మ అనే ఆశావర్కర్‌కు, ఆమె భర్త మొఖలింగానికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దంపతులకు దయా నిధిరూ.3లక్షలు అప్పు ఇచ్చాడు. తిరిగి చెల్లించాలని అడగగా దూషణకు పాల్ప డుతున్నాడంటూ దయానిధిపై వారు కేసుపెట్టారు. దీంతో మనస్తాపానికి గురైన దయానిధి శుక్రవారం గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ముందుగా తనచావుకు ఆశావర్కర్‌ చిలకమ్మే కారణమంటూ సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేసి వాట్సాప్‌లో మిత్రులకు పంపించాడు. మృతుని తండ్రి కృష్ణసోయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకమ్మ, మొఖలింగంను ఏఎస్‌ఐ కె.శ్రీరామ్మూర్తి అరెస్టు చేసి నరసన్నపేట కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. దీంతో కోర్టు వారికి రిమాండ్‌ విధించింది.

Updated Date - Apr 14 , 2026 | 11:20 PM